ఆళ్లగడ్డ నియోజకవర్గం ఉప ఎన్నికల గురించి కోర్టు క్లారిటీ ఇచ్చింది. అక్కడ ఉప ఎన్నిక నిర్వహణ ను నిర్వహించవచ్చని ఎన్నికల కమిషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పెండింగ్ లో ఉన్న ఈ వ్యవహారంపై ఒక కొలిక్కి వచ్చినట్టు అవుతోంది. మరి ఇప్పుడు ఈ వ్యవహారంలో స్పందించాల్సింది తెలుగుదేశం పార్టీనే ! శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆళ్లగడ్డ నియోజకవర్గానికి ఉప ఎన్నిక తప్పనిసరి అవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తూ నామినేషన్ వేసిన అనంతరం ఆమె మృతి చెందారు. అయినప్పటికీ ఆమె అభ్యర్థిత్వం తో పోలింగ్ కొనసాగింది. మరణించిన అనంతరం భారీ మెజారిటీతో ఆమె విజయం సాధించారు. దీంతో ఉప ఎన్నికలు ఖాయం అయ్యాయి. మరి ఈ ఎన్నికల్లో అభ్యర్థులుఎవరు? అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. ఇక్కడ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు లేవని ఇప్పటికే స్పష్టం అయ్యింది. ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా? లేదా? అనేదే కీలకమైన అంశం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శోభానాగిరెడ్డి తనయ పోటీ చేస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ వాళ్లు తాము పోటీ చేయడం ఖాయమేనని తెలుస్తోంది. మరి తెలుగుదేశం పార్టీ కూడా క్లారిటీ ఇచ్చేస్తే... ఈ వ్యవహారం కొలిక్కి వస్తుంది!

మరింత సమాచారం తెలుసుకోండి: