రాజకీయాల నుంచి కొంచెం పక్కకు జరిగినట్టుగా కనిపిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఇక సినిమాల్లో బిజీ అయిపోతాడని అందరూ అనుకొంటున్నారు కానీ.. అయితే మెగాస్టార్ మాత్రం తను ఒక కొత్త పని చేయబోతున్నట్టుగా ప్రకటించుకొన్నాడు. చిరంజీవి చేయబోయే ఆ కొత్త పని అధ్యయనం చేయడం. అది ఒక వ్యక్తి జీవితం గురించి. ఆ వ్యక్తి ఎవరో కాదు.. టి. సుబ్బరామిరెడ్డి. తను తిక్కవరపు సుబ్బరామిరెడ్డి జీవితం గురించి అధ్యయనం చేయాలనుకొన్నట్టుగా చిరంజీవి చెప్పుకొచ్చాడు. సుబ్బరామిరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా జరిగిన "మీట్ అండ్ గ్రీట్'' కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి ఈ విషయాన్ని ప్రకటించాడు. అయితే ఇది సుబ్బరామిరెడ్డిపై అభిమానం ఎక్కవై చేసిన ప్రకటన అనుకోవాలి. సుబ్బరామిరెడ్డి లైఫ్ స్టైల్ ను కీర్తిస్తూ చేసిన ప్రకటన అనుకోవాలి. అంతే గానీ సినిమాలతో బిజీ కావాలనే భావనలో ఉన్న చిరంజీవి ఇలాంటి పనులు పెట్టుకొంటాడని భావించలేం. సుబ్బారామిరెడ్డి 71 వ పుట్టిన రోజు సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు అనేక మంది హాజరయ్యారు. పార్టీలకు అతీతంగా వారందరూ సుబ్బారామిరెడ్డిని గ్రీట్ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, హీరో అక్కినేని నాగార్జున, టీడీపీ ఎంపీ సుజనాచౌదరి, నటుడు బ్రహ్మానందం, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, అపోలో ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాము వేరు వేరు పార్టీలకు చెందిన వాళ్లం అయినా వ్యక్తిగతంగా సన్నిహితులమేనని సుబ్బరామిరెడ్డిని ఉద్దేశించి వెంకయ్యనాయుడు ప్రకటించాడు. మొత్తానికి ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా నేతలందరూ పాల్గొనడంతో ఫుల్ గ్రాండ్ గా జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: