అక్రమ ఆస్తుల కేసులో జయలలిత భవితవ్యంపై ఈ శనివారం వచ్చే తీర్పుతో తమిళనాడు రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతాయని చెప్పవచ్చు. ఒకవేళ జయకు శిక్ష పడితే అది సంచలనమే అవుతుంది. ఆమె ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే పదవిని కూడా పొగొట్టుకొంటుంది. మరి ఇప్పుడు తమిళనాడులో మంచి స్వింగ్ మీదున్న జయలలిత జైలుకు వెళితే అంతకు మించిన సంచలన ఏముంటుంది?! ఒకవేళ జయలలిత జైలుకువెళితే ఆమె స్థానంలో కొత్త ముఖ్యమంత్రి రావాల్సి ఉంటుంది. జయలకు సన్నిహితులు, ఆమెకు విధేయులు అయిన వారు ఎవరో ఒకరు ఆ స్థానాన్ని భర్తీ చేస్తారని చెప్పవచ్చు. అయితే అదే జరిగితే కరుణానిధి పార్టీకి కొత్త రెక్కలు వచ్చినట్టేనని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆ పార్టీ చాలా ధీన స్థితిలో ఉంది. వరస ఓటములతో ఆపార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. జయ లలిత తమిళనాడు రాజకీయాలను దున్నేస్తుండటంతో కరుణ పార్టీ బిత్తర చూపులు చూస్తోంది. ఇటువంటి నేపథ్యంలో జయలలితకు శిక్ష పడితే డీఎంకే వాళ్ల కన్నా ఎక్కువ ఆనందించేవాళ్లు ఎవరూ ఉండరు. ఆ పార్టీ కూడా 2జీ స్కామ్ ఉచ్చు లో చిక్కుబడిపోయిన నేపథ్యంలో జయలలిత గనుకు జైలుకు వెళితే కరుణనాధికి ఆనందమే. అందులోనే అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇటువంటి నేపథ్యంలో డీఎంకేకు జయలలిత కెప్టెన్సీ లేకపోతే.. అన్నాడీఎంకే కు కొత్త ఊపిరి దక్కుతుంది. గత టర్మ్ లో అధికారాన్ని కోల్పోవడంతో పాటు.. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో కూడా డీఎంకే చిత్తు ఓడింది. దీంతో ఆ పార్టీ అవకాశం ఎదురు చూస్తోంది. ఇటువంటి నేపథ్యంలో జయకు గనుక శిక్ష పడితే... డీఎంకే దూసుకొచ్చే అవకాశం ఉంది. అలాగాక జయలలితనిర్దోషిగా బయటకొస్తే ఆమె రెట్టించిన ఉత్సాహంతోబలపడే అవకాశం ఉంది! మొత్తానికి ఈ తీర్పు తమిళణనాడు రాజకీయాలను మార్చేస్తుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: