అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి జయలలితకు బెంగళూరు కోర్టు శిక్ష విధించడంతో తమిళనాడు అగ్నిగుండమైంది. జయలలితకు శిక్ష విధించడాన్ని నిరసిస్తూ అన్నా డిఎంకె కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా విధ్వంసానికి దిగారు. దుకాణాలను బలవంతంగా మూయించారు.రాళ్ల వర్షం కురి పించారు.ఆస్తుల దహనానికి పాల్పడ్డారు. రవా ణాను అడ్డుకున్నారు. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో హింస ప్రజ్వరిల్లింది. అన్నా డిఎంకె కార్యకర్తలు డిఎంకె అధ్యక్షుడు ఎంకె కరుణానిధి, ఆయన కుమారులు ఎంకె స్టాలిన్‌, ఎంకె అళగిరి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. చెన్నై, మధురైలతో పాటు పలు ప్రాంతాల్లో డిఎంకె పోస్టర్లు తగుల బెట్టారు. బిజెపి నాయకుడు సుబ్రమణ్యస్వామి నివాసంపై కొంతమంది ఆందోళనకారులు రాళ్లవర్షం కురిపించారు. కరుణానిధి నివాసం గోపాలపురంలో డిఎంకె, అన్నా డిఎంకె కార్య కర్తలు బాహాబాహీకి దిగారు. వెప్పూరు గ్రామంలో ఆర్‌టిసి బస్సుకు నిప్పంటించారు. కడలూరు జిల్లాలో 20 బస్సులపై రాళ్లురువ్వి ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు. అంబత్తూరు, సేలం జిల్లాలోని ఇదపడి, కడలూరు, జయలలిత నియోజకవర్గం శ్రీరంగంలలో రాళ్లురువ్వుకున్న ఘటనలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రం లోని పలు ప్రాంతాల్లో దుకాణాలు, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. మదురైలో రోడ్డు ప్రక్కన నిలిపిన ద్విచక్ర వాహనాలను ఆందోళన కారులు ధ్వంసం చేశారు. చెన్నైలోని పోయిస్‌ గార్డెన్‌ ప్రాంతంలో డిఎంకె నాయకుల దిష్టి బొమ్మ లు దాహనంచేశారు. మదురైలో అన్నా డిఎంకె కార్యకర్తలు రవాణాను అడ్డుకున్నారు. వాణిజ్య సముదాయాలనుబలవంతంగా మూయిం చారు. కొన్ని దుకాణాలు ధ్వంసమయ్యా యని పోలీసులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా భారీగా భద్రతా బలగాలను మోహరించినట్లు పోలీసులు చెప్పారు

మరింత సమాచారం తెలుసుకోండి: