న్యూయార్క్ మాడిసన్ స్వేర్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం ప్రవాస భారతీయులను ఆకట్టుకుందని విశ్లేషణలు వస్తున్నాయి. ప్రధాని పదవి చేపట్టాక తాను 15 నిమిషాలు కూడా విశ్రాంతి తీసుకోలేదని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం విశేషం. స్వాతంత్య్ర పోరాటం జాతీయ ఉద్యమంలా సాగినట్టే అభివృద్ధి సాధన కూడా జాతీయ ఉద్యమం కావాలన్నారు. దేశాభివృద్ధిని ప్రజా ఉద్యమంగా మలుస్తామని స్పష్టం చేశారు. తాను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విదేశాల్లో, అక్కడ కలిగిన మార్పును చూసేందుకు విదేశాల్లో ఉన్న భారతీయులను దేశానికి తిరిగి రావాల్సిందిగా ఆహ్వానించానని, ఇప్పుడు కూడా అదే ఆత్మవిశ్వాసంతో ఉన్నానని చెప్పారు. .  ‘‘ఇక్కడ కూర్చున్న ప్రజలు (ప్రవాస భారతీయులు) భారతదేశంపై గొప్ప ఆశలు పెట్టుకున్నారని నాకు బాగా తెలుసు. భారతదేశంలో కూడా ప్రజలు ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రజల కలలను, ఆకాంక్షలను అన్నిటినీ మా హయాంలోనే నెరవేరుస్తామని నేను మీకు హామీ ఇస్తున్నాను’’ అపి మోడీ అన్నప్పుడు కరతాళ ధ్వనులు మార్మోగాయి. 2022 నాటికి దేశంలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంటుందని ఆయన ఆశాబావం వ్యక్తం చేశారు.అప్పటికి భారత్ కు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్లు అవుతుందని ఆయన చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: