టాంక్ బండ్ పై ఆంద్ర ప్రముఖుల విగ్రహాలను తొలగిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పడం కేవలం ప్రజలను సెంటెమెంటు భావజాలంలో ఉంచడానికి చేసే ప్రయత్నమేనని బిజెపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్.ఇంద్రసేనారెడ్డి అన్నారు.ఎంతకాలం ఇలా ప్రజలను మభ్యపెడతారని ఆయన అన్నారు.నిజాం ను పొగుడుతూ ఒకవైపు మాట్లాడుతున్న కెసిఆర్ ఇప్పుడు టాంక్ బండ్ పైవిగ్రహాల గురించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.గతంలో స్వాతంత్రయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ మరణిస్తే ,కనీసం ఆయన భౌతిక కాయాన్నిచూడడానికి రాలేదని, ఇప్పుడు మాత్రం ఆయన విగ్రహం గురించి మాట్లాడుతున్నారని ఇంద్రసేనారెడ్డి విమర్శించారు.ప్రభుత్వం అసలు పనిచేస్తున్నదా అనే అనుమానం కలుగుతున్నప్పుడు బతకమ్మ ఉత్సవాలనో విగ్రహాలనో, ఇలా సెంటెమెంటును రెచ్చగొడుతున్నారని కెసిఆర్ పై ఆయన విమర్శలు కురిపించారు. అయితే దీనిపై టిఆర్ఎస్ నేత,డిల్లీలో అదికార ప్రతినిధి వేణగోపాలాచారి మాట్లాడుతూ కెసిఆర్ ఉద్దేశం విగ్రహాలను తొలగించడం కాదని , తెలంగాణ విగ్రహాలను ఏర్పాటుచేయడం, తెలంగాణ సంస్కృతిని పరిరక్షించడం అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: