కాసేపట్లో న్యూయార్క్ లోని చరిత్రాత్మక మాడిసన్ స్క్వేర్ వద్ద భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలోని ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగిస్తారు. అందరు జర్నలిస్టుల్లాగే టీవీ టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయ్ కూడా తన సరంజామాను సిద్ధం చేసుకుంటున్నారు. ఈలోగా మోడీ అనుకూలురుగా భావిస్తున్న కొంత మంది యువకులతో కూడిన ముఠా ఆగ్రహంతో ఊగిపోతూ ఆయనపైకి ఎగబడింది. సుదీర్ఘ పాత్రికేయ ప్రస్థానంలో ఈ తరహా దాడులను ఎన్నింటినో ఎదుర్కొన్న రాజ్ దీప్ మాత్రం ఏమాత్రం జంకలేదు. పరుగెత్తుకు వచ్చిన ఆ ముఠా రాజ్ దీప్ పై దాడి చేసింది. ఆనక అక్కడి నుంచి జారుకుంది. దీనిపై తన ట్విట్టర్ లో రాజ్ దీప్ వ్యంగ్యంగా స్పందించారు. ‘‘మాడిసన్ స్క్వేర్ వద్ద భారీ జన సందోహం ఉంది. అవమానించడమే లక్షణంగా భావించే కొందరు మూర్ఖులు కూడా వారిలో ఉన్నారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘అదృష్టం కొద్దీ ఆ మూర్ఖులను కెమెరాలో బంధించగలిగాం. అవమానమంటే ఎలా ఉంటుందో వారికి చూపించడానికి ఆ మాత్రం ఆధారం చాలు’’అంటూ రాజ్ దీప్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: