తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పామర్రు ఇన్‌చార్జి వర్ల రామయ్య జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ నిన్న బెంగుళూర్‌లో సిబిఐ కోర్టు జడ్జి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్ధుల కేసులో నాలుగు సంవత్సాలు జైలు శిక్ష, 100 కోట్ల రూపాయల జరిమాన విధించటంతో భారతదేశంమంతా కూడా ఉలిక్కిపడి జయలలిత వైపు చూసారు. కానీ ఆంధ్రప్రదేశ్‌ రాష్టమ్రంతా కూడా వైయస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి వైపు చూసారు, శిక్ష పడింది ఆమెకు కదా జగన్మోహనరెడ్డి భవిష్యత్తు తెలుగు ప్రజలకి, మన రాష్ట్ర ప్రజలకి ఆ పార్టీ వారందరికి కూడా సుష్పష్టంగా కనపడిందన్నారు. జగన్‌ భవిష్యత్తు ఏమిటి, ఏమవ్వబోతున్నారు, ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుంది ఇతనికి, ఎన్ని కోట్ల రూపాయల జరిమానా వేస్తారు, ఇతని భవిష్యత్తు ఏ జైలులో బంధీకృతం కాబోతుందని తెలుగు ప్రజలు ఆలోచిస్తున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ఐపిసి 420, 409, 468, 471 ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరెప్షన్‌ ఆక్‌‌ట సెక్షన్‌ 11, 12, 13(1) సి అండ్‌ డి, 13(2) ఇంకా మనీలాండరింగ్‌ యాక్‌‌ట ఉంది, ఇంకా దర్యాప్తు చాలా పెండింగ్‌ ఉంది, 43 వేల కోట్ల రూపాయలు అక్రమాస్తులున్నాయని సిబిఐ గుర్తించిందన్నారు. 66 కోట్ల రూపాయలకే నాలుగు సంవత్సరాలు, 100 కోట్ల జరిమానా పడితే 43 వేల కోట్ల రూపాయలకు ఎన్ని ఎక్‌‌సట్రా సెక్షన్‌లున్నాయి. జగన్‌ నేరం ఖండ ఖండాంతరాలకు పాకింది, దేశంలో ఎవరిని వదల్లేదు మన బాబు ఇటువంటి జగన్మోహనరెడ్డి భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుందో రాష్ట్ర ప్రజలకు తెలుస్తుందన్నారు. జగన్‌ తీహర్‌ జైలులోనో, చంచల్‌గూడ జైలులోనో, చర్లపల్లి జైలులోనో మగ్గబోతున్నాడని అందరికి తెలిసిన నేపధ్యంలో నైతిక విలువలుంటే మరల కోర్టు నీవు నిర్ధోషి అని చెప్పేంతవరకు నీవు తప్పు చేయలేదని చెప్పేంతవరకు నీ పార్టీ అధ్యక్ష పదవికి, నీ శాసనసభ్యత్వానికి ప్రతిపక్ష నేతగా నువ్వు రాజీనామి చె య్యాలని డిమాండ్‌ చేశారు. నీతో పోలిస్తే ఆమెది చాలా చిన్న కేసు, ఆమె చేసిన నేరం చాలా చిన్నది అలాంటిది ఆమెకే ఈ రకంగా న్యాయస్ధానం శిక్షవేస్తే నీకెంత వెయ్యాలి, ఆమె నేరానికి 40 పేజీల తీర్పు వస్తే, నీకు ఎన్ని వేల పేజీలు రావాలి తీర్పు అని అన్నారు. పిట్టల్లాగా ఎగిపోవటానికి నీ పార్టీ నేతలంతా సిద్దంగా ఉన్నది నిజం కాదా నిన్నటి నుండి ఏమి జరుగుతుంది నీ క్యాంపులో, ఈ పార్టీలో మనగతమేంటి, మన పార్టీ ఉంటుందా , మన అధ్యక్షుడు ఉంటాడా, జైలు కెళ్తాడా, ఇటువంటి నేరస్తుడి నాయకత్వంలో పనిచేస్తే నా భవిష్యత్తు ఏమిటని నీ పార్టీ నేతలంగా ఆలోచించడం నిజం కాదా అని అన్నారు. 11 చార్జిషీట్లలో వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని కొట్టేసిన నీకు శాసనసభ్యుడిగా కొనసాగే నైతిక అర్హత ఎక్కడ ఉందని ప్రశ్నించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: