ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైసిపి పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఎప్పటికైనా జైలుకు పోక తప్పదని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాస్తులు సంపాదించేవారు ఎవరైనా సరే చట్టం ముందు తల వంచక తప్పదన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దోచుకున్న వైయస్ జగన్‌కు తన భవిష్యత్ ఏమిటో అని జయలలితకు పడిన శిక్షతో అర్థమయి ఉంటుందన్నారు. జయపై కేవలం ఒక ఛార్జ్ షీట్ మాత్రమే దాఖలయిందని, అవినీతికి పాల్పడితే జైలుకు పోకతప్పదని మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. అక్రమాస్తుల కేసులో జయలలితకు కోర్టు విధించిన శిక్షను తాను స్వాగతిస్తున్నానని, చట్టం ముందు అందరూ సమానులే అన్నారు. ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ విచారణలో దోషిగా తేలడం ఖాయమన్నారు. రూ.66 కోట్ల అవినీతికి పాల్పడిన జయకు కోర్టు కఠిన శిక్షను విధించిందని, జగన్ కేసులో ఇప్పటికే రూ.850 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందని, సీబీఐ పిటిషన్లలో జగన్ వేలాది కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడ్డారని ఉందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: