హస్తానికి కేసీఆర్‌ సెగ తగులుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. అటు తనకు సీనియర్లు.. జూనియర్లు కూడా సహకరించడం లేదంటూ పీసీసీ అధ్యక్షుడి హస్తినకు ఫిర్యాదులతో చేరుకున్నారు. ప్రధాన ప్రతిపక్షంలో కల్లోలం రేపుతున్న తుపాను ఏ తీరం చేరుతుందో కార్యకర్తలకు అర్ధం కావడం లేదు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ జపం చేస్తున్నారు. గులాబీ బాస్‌ను కలిసి మరీ సర్కార్‌ను పొగడ్తలతో ముంచెతుతున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజెయ్‌కుమార్‌ సిఎంను కలిశారు. దీంతో ఒక్కసారిగా హస్తంలో కలకల మొదలైంది. ఎమ్మెల్యేలు పార్టీ వీడతారంటూ ప్రచారం జరుగుతోంది. హస్తానికి హ్యండిచ్చి.. కారు ఎక్కుతారని ఊహాగానాలు ఉపందుకున్నాయి. కోమటిరెడ్డి పార్టీ మారే యోచన లేదంటూనే పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై విమర్శలు వర్షం కురుపించారు.  ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు చేయాల్సిన పనిలేదని.. పొన్నాల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. వాస్తవానికి భరోసా యాత్రలో కూడా కోమటిరెడ్డి పాల్గొనలేదు.. దీంతో ఆయన తాజా భేటిపై అనుమానాలు సహజంగా వెల్లువెత్తుతున్నాయి. హస్తంలో ఉంటారా? పార్టీ వీడతారా అన్నది తేలాలి. ఎన్నికలకు ముందు కూడా కోమటిరెడ్డి బ్రదర్స్‌ కేసీఆర్‌లో పలుమార్లు సమావేశాలయ్యారు. కానీ చేరలేదు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్న కారణంగా కేసీఆర్‌కు దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మరోసారి కేసీఆర్‌ జపం చేయడం అనుమానాలకు తావిస్తోంది. అటు పువ్వాడ అజయ్‌ కుమార్‌ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. మొదట్లో వైసీపీలో చేరి.. తర్వాత కాంగ్రెస్ టికెట్‌ సంపాదించిన పువ్వాడ ఆజయ్‌ మనసు అధికార పార్టీ వైపు మళ్లినట్టు తెలుస్తోంది. తనకున్న వ్యాపారాలు.. సర్కారుతో అవసరాలు అటుగా లాగుతున్నయట. అయితే తుమ్మలను కాదని గులాబీ బాస్ పార్టీలో చేర్చుకుంటారా అన్నది అనుమానామే. ఇప్పటికే కాంగ్రెస్‌లో సీనియర్ల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహకరించడం లేదు.. ప్రభుత్వంపై వ్యతిరేకత క్యాష్‌ చేసుకోవడానికి ప్రయత్నించినా వారు కలిసి రావడం లేదు. అటు జూనియర్లు కూడా సర్కార్‌కు మద్దతుగా నిలవడం లేదంటూ పొన్నాల ఫిర్యాదులతో ఢిల్లీకి వెళ్లారు. వీరి వ్యవహరం అధిష్టానం పెద్దల దగ్గర తేల్చుకోవాలని నిర్ణయించారు. అటు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డిఎస్‌ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. వీరి మధ్య పంచాయితీ తేల్చడానికి హస్తిన అధినాయకత్వం కుస్తీలు పసడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: