ఇప్పడు హదూద్ తుపాను బాధితుల కోసం దాతలు డొనేట్ చేస్తున్న డబ్బు అంతా సీఎం రిలీఫ్ ఫండ్ ఖాతాలోకి జమ అవుతుంది. దాతలు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఖాతాలోకి జమ చేయడానికే ఈ విరాళాల ప్రకటన చేస్తున్నారు. ప్రత్యేకించి సినిమా వాళ్లు ఇప్పడు తమ దాతృత్వం ఏ స్థాయిదో చాటుకొంటున్నారు. మరి వీరికి ధీటుగా స్పందించాడు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి. హుదూద్ బాధితుల సహాయార్థం ఆయన 50 లక్షల రూపాయల డబ్బును విరాళంగా ప్రకటించాడు. అయితే జగన్ విరాళం సీఎం రిలీఫ్ ఫండ్ కిందకు చేరడం లేదు. ఆయన వైఎస్సార్ ఫౌండేషన్- సాక్షి మీడియా చేపట్టనున్న సహాయ కార్యక్రమాలకు ఈ డబ్బును డొనేట్ చేశాడు. తుపాను బాధిత ప్రాంతాల్లో వైఎస్సార్ ఫౌండేషన్ తరపున సహాయ కార్యక్రమాలను చేపడుతున్నారట. సాక్షి మీడియా సహకారంతో ఈ కార్యక్రమాలను చేపట్టున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి ఆ సంస్థలకు 50 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చారు. అలాగే మరింత మంది దాతల సహకారం కూడా తీసుకొని సహాయ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వైఎస్సార్ ఫౌండేషన్ ప్రకటించింది. మరి ఎవరైతేనేం... ఏ రూపంలో అయితేనేం.. ఇప్పుడు బాధితులకు సహాయం అందించడం ప్రదానం. ఈ విధంగా పార్టీల, నేతల సెంటిమెంట్లతో మరిన్ని ఎక్కువ విరాళాలు వ

మరింత సమాచారం తెలుసుకోండి: