తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాష్ట్రం పాలిట ఒక ఐరన్ లెగ్ అని అంటున్నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. వైకాపా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అయిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. ముఖ్యమంత్రిపై ఈ తరహాలో విరుచుకుపడటం విశేషంగా మారింది. బాబు వల్లనే ఈ అరిష్టాలు జరుగుతున్నాయని నల్లపరెడ్డి వ్యాఖ్యానించాడు. మరి అదెలా.. ప్రకృతి విపత్తులకు చంద్రబాబు ఏ విధంగా కారణం అవుతాడు? అని ఆయనను అడిగితే ఆయన ఇలా వివరించాడు... ప్రజలను పాలించే వాళ్లు సూర్యాస్తమయం తర్వాత ప్రమాణస్వీకారం చేయకూడదని పలువురు పీఠాధిపతులు చెప్పారని ప్రసన్నకుమార్ రెడ్డి అన్నాడు. అలా చేస్తే ఆయా దేశాలు, రాష్ట్రాలకు అరిష్టమని వారు హెచ్చరించారని గుర్తు చేశారు. చంద్రబాబు రాత్రి 7.27 గంటలకు సీఎంగా ప్రమాణస్వీకారం చేశారని, అది అరిష్టమనేందుకు సూచికగా ప్రమాణస్వీకారానికి అరగంట ముందు హిమాచల్‌ప్రదేశ్‌లో 25 మంది తెలుగు పిల్లలు నదిలో కొట్టుకుపోయి మృతిచెందారని నల్లపురెడ్డి వ్యాఖ్యానించాడు. అప్పటి నుంచి ఎక్కడో చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఈ క్రమంలోనే హుదుద్ తుపాన్‌తో విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు అల్లకల్లోలంగా మారాయని ఆయన అభిప్రాయపడ్డాడు. ప్రధానంగా విశాఖపట్టణం అతలాకుతలమైందన్నారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం అనంతరమే ప్రకృతి కన్నెర్ర చేసిందన్నారు. ఇది ఇంతటితో ఆగదని ఇంకా ఎన్నో చూడాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారని నల్లప రెడ్డి చెప్పాడు. ఈ విధంగా ముఖ్యమంత్రి పై ధ్వజమెత్తాడు ప్రతిపక్ష పార్టీకి చెందిన ఈ నేత. మరి ఇవి కేవలం రాజకీయ విమర్శలు అని అనకోవాలా?! లేక వీటిని నమ్మి ఏదైనా ప్రభుత్వం ఏదైనా శాంతి చేయించాలా?!

మరింత సమాచారం తెలుసుకోండి: