ఎన్నికల కు ముందు తెలుగుదేశం పార్టీ రుణమాఫీ హామీ ఇవ్వడం, ఆ హామీని ఇప్పటికీ అమలు చేయకపోవడం... ఇప్పుడు రైతులకు పెనుముప్పుగా మారింది. ప్రత్యేకించి విశాఖ పట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా రైతులకు రుణమాఫీ దెబ్బ పడింది! రుణమాఫీ జరుగుతుందన్న ఆశలతో ఉన్న రైతులకు ఇప్పుడు తుపాను ముప్పుఎదురైంది. దీంతో మొదటికే మోసం వచ్చింది. బీమాకు కూడా ఎసరు వచ్చింది. తుపాను ఫలితంగా జరిగిన నష్టం గురించి ఆలోచిస్తున్న క్రమంలో రైతుల పరిస్థితిని సమీక్షిస్తే వారి ఈ తుపాను పీడకలేనని తెలుస్తోంది. తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులకు బీమా దక్కేఅవకాశం లేదని స్పష్టం అవుతోంది. ఈ మేరకు బ్యాంకు అధికారులు కూడా ఒక ప్రకటన చేశారు. తుపాను బాధిత రైతులకు బీమా సదుపాయం లేనట్టేని వారు వ్యాఖ్యానించారు. రైతులు రుణాలను రెన్యువల్ చేయలేదని.. అందుకే వారు ఇప్పుడు పంటల బీమాకు అర్హత కోల్పోయారని. తుపాను వచ్చి పంటలను నాశనం చేసినా.. ఇప్పుడు వారికి సహాయం అందే అవకాశం లేకుండా పోయిందని వారు వివరించారు. రైతులు బ్యాంకుల్లో లోన్లను రెన్యువల్ చేసి ఉంటే... ఇన్సూరెన్స్ లకు అర్హత పొందే వారని.. వారు ఆ పని చేయలేదు కాబట్టి ఇప్పుడు పంట నష్టం బీమా అందే అవకాశం లేదని అధికారులు వివరించారు. రైతులు ఎందుకు రుణాల రెన్యువల్ చేయలేదు? అంటే.. దానికి రుణమాఫీ హామీనే కారణం. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన నేపథ్యం రుణాలన్నీ రద్దయిపోతాయి.. బాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకొంటాడనే ఆశతోఉన్న రైతులు రుణాలను రెన్యువల్ చేయలేదు. అదే సమయంలో అవి మాఫీ కూడా జరగలేదు. దీంతో బీమా పొందే అవకాశం లేకుండా పోయింది. తుపాను బాధిత రైతులకు నిరాశే మిగిలింది!

మరింత సమాచారం తెలుసుకోండి: