ట్విట్టర్ లో పోస్టులు చేయడమే కాదు… ఇకమీదట పాటలు కూడా వినొచ్చు…… అవును నిజమే…….! ట్విట్టర్ తన యూజర్ల కోసం కొత్త ఆప్షన్ స్టార్ట్ చేసింది. దీంతో, మొబైల్ ఫోన్ లో ట్విట్టర్ అకౌంట్ లోకి లాగిన్ అయ్యి పాటలు వినొచ్చు. బెర్లిన్ కి చెందిన ‘సౌండ్ క్లౌడ్’ అనే ఆడియో స్ట్రీమింగ్ సర్వీసెస్ సహకారంతో ఈ సర్వీస్ ను స్టార్ట్ చేస్తోంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ ఫాంల మీద అందిస్తున్న ‘ట్విట్టర్ ఆడియోకార్డు’ ద్వారా పాటలు వినొచ్చు. ట్విట్టర్ యాప్ లో లాగిన్ అయ్యి ఉన్నంత సేపు పాటలు వినొచ్చని ట్విట్టర్ చెప్పింది. సౌండ్ క్లౌడ్‑లో పార్టనర్లుగా ఉన్న నాసా, వాషింగ్టన్ పోస్ట్, సీఎన్ఎన్, డేవిడ్ గెట్టా, కోల్డ్ ప్లే, వార్నర్ మ్యూజిక్, డైలీ మెయిల్.. ఇలాంటి సర్వీసెస్ నుంచి ట్విట్టర్ మ్యూజిక్ వినచ్చు. మ్యూజిక్ లవర్స్ కి ఈ ఆప్షన్ ఎంతగానో నచ్చుతుందని ట్విట్టర్ ఆశిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: