ఐదు మ్యాచ్‌ల వన్డే సీరీస్‌ 2-1తో భారత్‌ ఖాతాలో చేరింది. హుదూద్‌ తుఫాన్‌ కారణంగా మూడో వన్డే, విండీస్‌ ఆటగాళ్లకు వారి అసోసియేషన్‌తో ఏర్పడ్డ సంక్షభం కారణంగా ఐదో వన్డే రద్దు అయ్యాయి. ఈ నేపథ్యంలో జరిగిన మూడు మ్యాచ్‌లో భారత్‌ 2 విజయాలు నమోదు చేసుకోగా.. తొలి వన్డేను దక్కించుకున్న విండీస్‌ తన పర్యటనను మధ్యలోనే రద్దు చేసుకొని స్వదేశానికి బయలు దేరింది.ఇక్కడ శుక్రవారం నాడు జరిగిన నాల్గో వన్డేలో భారత్‌ 59 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. విరాట్‌ కొహ్లీ చాలా రోజుల తర్వాత శతకంతో విధ్వంసం సృష్టించగా.. రైనా (71) అతనికి చక్కని సహకారం అందించాడు. వీరిద్దరు కలిసి మూడో వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి భారత్‌ స్కోరును అమాంతం పెంచేశారు. ఆఖరి బంతి వరకు విండీస్‌ బౌలర్లపై విరుచుకుపడ్డ కొహ్లీ భారత్‌ ప్రత్యర్థి ముందు 331 పరుగుల విజయ లక్ష్యాన్ని నిలిపాడు.  అంతకు ముందు ఓపెనర్లు అజయెంకా రహెనా (68) సూపర్‌ ఆరంభానికి ధావన్‌ (35) అనుభవం తోడవ్వడంతో తొలి వికెట్‌కు 70 పరుగులు జత చేసిన ఈ జోడీ గట్టి పునాది వేసింది. కాగా ఆరంభంలో టాస్‌ గెలిచిన విండీస్‌ భారత్‌కు బ్యాటింగ్‌ అప్పగించింది. దీంతో భారత ఓపెనర్లు చుక్కలు చూపిన విండీస్‌ బౌలర్ల జోరుకు నెమ్మదించిన రహెనా, ధావన్‌ తొలి ఐదు ఓవర్లలో కేవలం 20 పరుగులు మాత్రం చేయడంతో విండీస్‌ కట్టడి చేయగల్గింది. కానీ కొంత సేపటికే పుంజుకున్న ఇండియన్స్‌ గాడిలోపడి పరుగుల వరద పారించారు. అనంతరం భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ తీవ్ర ఒత్తిడిలో బ్యాటింగ్‌ చేసింది. రెండో ఓవర్‌లోనే ఓపెనర్‌ స్మిత్‌ (0) వికెట్‌ను కోల్పోయిన విండీస్‌ కొద్ది సేపటికే పొలార్డ్‌ (6)ను కూడా కోల్పోయింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన రామ్‌దిన్‌ (9), బ్రావో (0) ఒకరి వెంట ఒకరు పెవీలియన్‌కు క్యూ కట్టిన సామ్యుల్‌ (112) ఒక్కడే ఒంటరి పోరాటం చేసి అద్భుత శతకాన్ని ఆవిశ్కరించి తుది వరకు పోరాడాడు. కానీ భారత్‌ భారీ లక్ష్యానికి తోడు బౌలర్లు సమస్టిగా రాణించడంతో చేతులెత్తేసి విండీస్‌ సీరీస్‌ను 48.1 ఓవర్లలో 271 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌కు తెర దించింది. దీంతో 59 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్‌ సీరీస్‌ను కైవసం చేసుకుంది.సంక్షిప్త స్కోర్లు - భారత్‌ : (50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) 330.విండీస్‌ : (48.1 ఓవర్లలో ఆలౌట్‌) 271.

మరింత సమాచారం తెలుసుకోండి: