రాష్ట్రం రెండుగా విడిపోయినా ఆర్టీసీ మాత్రం ఇంకా ఉమ్మడిగానే ఉంది. అయితేనేం... రెండు రాష్ట్రాల బస్సులకు పేర్లు, రంగులు మార్చే ఆలోచనలో ఉంది. ఈ మేరకు ఇప్పటికే రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్టీసీ యాజమాన్యం ప్రతిపాదనలను కూడా పంపింది. తెలంగాణలో 'పల్లెవెలుగు' బస్సుల పేరును 'గ్రామరథం'గా, ఏపీలో 'తెలుగు వెలుగు'గా మార్చాలని భావిస్తోంది. అలాగే ఇంద్ర బస్సులను తెలంగాణలో రాజధానిగా, ఏపీలో 'నగర వారధి'గా మార్చాలని యోచిస్తోంది. అంతేకాకుండా బస్సులకు కొత్త రంగులద్దేందుకు సిద్ధమయింది. ఏపీలోని బస్సులకు 20 శాతం పసుపు రంగు, తెలంగాణలోని బస్సులకు 20 శాతం గులాబీ రంగు వేయాలని నిర్ణయించింది. ఈ రెండు రంగులూ, రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీల రంగులు కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: