దేశానికి చెందిన నల్ల ధనాన్ని విదేశాల నుండి భారత్ కు తెప్పిస్తామని చెప్పి హామిలిచ్చి అధికారంలోకి వచ్చిన మోది ఇప్పుడా అంశాన్ని అంత సీరియస్ గా తీసుకోవడం లేదంటూ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదికి ఆయన ఓ లేఖ రాశారు. స్విస్ బ్యాంక్ లో ఖాతాలు ఉన్నకుబేరుల పేర్లను బయటకు వెల్లడించలేమంటూ సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిందిగా హజారే ఈ లేఖలో కోరారు. లేదంటే తాను మళ్ళీ దీక్షకు దిగడానికైనా సిద్ధం అని హెచ్చరించారు.మోదీ అధికారంలోకి వచ్చిన ఈ ఐదు నెలల్లో లోక్ పాల్ నియామకం, బ్లాక్ మనీ విషయాలపై ఎటువంటి ముందడుగు పడలేదని ఆయన విమర్శించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే, ‘కరప్షన్ ఫ్రీ ఇండియా’ నినాదంపై ప్రజలు ఇప్పుడు అనుమానం వ్యక్తం చేయడం మొదలుపెడతారని అభిప్రాయపడ్డారు. ‘కేవలం ఎన్నికల్లో గెలవడం కోసమే బీజేపీ ఇలా వ్యవహరించిందేమో’ అని అనుకునే అవకాశాలూ లేకపొలేదని ఈ లేఖలో పేర్కొన్నారాయన.

మరింత సమాచారం తెలుసుకోండి: