తెలంగాణ రాష్ట్రం లో విద్యుత్‌ కష్టాలు ఎప్పటికి తీరతాయనేది సందే హాస్పదంగా తయారైంది. రాష్ట్రంలో డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ సరఫరా కాకపోపడంతో ప్రధానంగా వ్యవసాయానికి తీవ్ర ఆటంకాలు ఏర్ప డ్డాయి. రాష్ట్రంలో గంటల కొద్దీ కోతలను విధిం చడం, పవర్‌ హాలిడే ప్రకటించడం వంటి చర్యలకు దిగడంతో కేసీఆర్‌ ప్రభుత్వంపై వివిధ వర్గాల్లో వ్యతిరేకత పెరుగుతోంది. దీంతో విద్యుత్‌ కొరతను అధికమించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుండి విద్యుత్‌ను కొనుగోలు చేస్తోం ది. ఇందులో భాగంగా ఇటీవల పక్క రాష్ట్రాల నుండి 2,500 మెగావాట్ల విద్యుత్‌ సరఫరాకు ఒప్పందం కుదుర్చుకుంది. అయినా రాష్ట్రంలో విద్యుత్‌ కొరత పెరగడంతో కనీసం మరో 2500 మెగావాట్ల విద్యుత్‌ అత్యవసరం అయ్యింది. ఈనేప థ్యంలో విద్యుత్‌ సేకరణపైనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. దీంతో ఈనెల 1వ తేదీ నుండి 19వ తేదీ వరకూ ఎనిమిది రూపాయల చొప్పున 143.7297 మిలియన్‌ యూనిట్లను సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు గాను 114.99 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. మరోపక్క విద్యుత్‌ కొరతను తీర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నా య మార్గాలను అన్వేషిస్తోంది. ఇందుకు సోలార్‌ పవర్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రాధాన్యత నిస్తోంది. సోలార్‌ వినియోగాన్ని భారీగా పెంచేందుకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రణాళికా బద్దంగా అడుగులు వేస్తోంది. సోలార్‌ వినియోగం తో విద్యుత్‌ డిమాండ్‌ను తగ్గించడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్న తెలంగా ణ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా వాటికి సంబంధించిన ప్రాజెక్టుల ఏర్పాటుకు స న్నాహాలు చేస్తోంది.  తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ లోటును భర్తీ చేయాలనే దృ ఢనిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. కొత్త ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా మొదటి దశలో 1,380 మెగావాట్ల సో లార్‌ విద్యుత్‌ ప్రాజెక్టులను తక్షనం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. తెలం గాణ రాష్ట్రానికి 500 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టుల నిమిత్తం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ప్రీబిడ్‌లకు ఇప్పటికే భారీ స్పందన వచ్చింది. విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తూ 390 కంపెనీల ప్రతినిధులు హాజరుకావడంతో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య నుండి గట్టెక్క వచ్చని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు సింగిల్‌ విండో ద్వారా అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. బొగ్గు ఆధారిత విద్యుత్‌పై ఆధార పడడాన్ని తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సౌర విద్యుత్‌ ఉత్పత్తిపైనే కేంద్రీకరించింది. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో దే శంలోనే అతి పెద్దదిగా భావిస్తున్న వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామ ర్థ్యం ఉన్న సౌర విద్యుత్‌ ప్లాంటు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకు అవసరైన దాదాపు ఐదువేల ఎకరాలకు పైగా భూమిని కూడా గుర్తించింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలను అందించేందుకు సోలా ర్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఇప్పటికే ప్రకటించింది.  ఈమేరకు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన అభివృద్ధి సంస్థతో ఒక ఒప్పందం కూ డా కుదుర్చుకున్నట్లు సంబంధిత ఉన్నతాధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. కాం పిటేటీవ్‌ బిడ్డింగ్‌ ప్రాతిపదికన డెవలపర్స్‌ను ఎంపిక చేయాలని నిర్ణయించారు. అయితే వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంటును ప్రభుత్వ పరంగా నెలకొల్పాలా లేక ప్రైవేటు పెట్టుబడుదారులకు అవకాశం కల్పించాలా అనేదానిపై ఇంకా స్పష్టత లేనట్లు సమాచారం. ఔత్సాహికులు ముందుకు వస్తే జపాన్‌ ఆర్థిక సంస్థ సహకారంతో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు రు ణాలు అందేలా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. సౌర విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లను నెలకొల్పేందుకు ఔ త్సాహిక పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపుతున్నా యూనిట్‌ ధర నిర్ణయంపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని తెలిసింది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ సౌర విద్యుత్‌ యూనిట్‌ ధరను 6.50 రూపాయల నుండి 7.50 రూపా యలుగా పేర్కొంటోంది. పెట్టుబడులతో పోలిస్తే ట్రాన్స్‌కో నిర్ణయిస్తున్న ధర అంత లాభదాయకం కాదనే భావన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల్లో వ్యక్తమ వుతోంది. ఈనేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటు కు సంబంధించిన బిడ్లను ఇటీవలే పూర్తి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: