దక్షిణ తూర్పు అరేబియా సముద్రంలో నెలకొన్న అల్పపీడనం బలపడుతోంది. రానున్న 24 గంటల్లో ఇది తీవ్రమై రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ శాఖ తెలియజేసినట్లు విశాఖపట్నం తుపాన్‌ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం తూర్పు మధ్య అరేబియా సముద్రం మహారాష్ట్ర, కోస్తా ప్రాంతం మీదుగా విస్తరించి ఉంది. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం దక్షిణ పడమటి దిశగా శ్రీలంక కోస్తా వరకు సముద్ర నీటి మట్టానికి 3.1 కిలో మీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రానున్న 24 గంటల్లో కేరళ, తమిళనాడులలో ఉరుములతో కూడిన వర్షాలు విస్తారంగా ఉంటాయి. ఇది తుపాన్‌గా మారి తీరం దాటితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ దక్షిణాది రాష్ట్రాలలో కూడా రెండు రోజులు పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాస్తవేత్తలు అంచనా వేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో ఈ నెల 25 నుండి 29వ తేదీ వరకు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: