దీపావళి.. దీవాళీ.. ఏ పేరుతో జరుపుకున్నా.. దేశమంతా వెలుగులు నిండే పండుగ ఇది. హిందువులు జరుపుకునే అన్ని పండుగల్లోకీ కలర్ ఫుల్ పండుగ అంటే ఇదే.. ప్రత్యేకించి మతాబుల వెలుగులు.. టపాసులు సందడి.. దేశానికే కొత్త క్రాంతినిస్తాయి. అలాంటి పర్వదినం వేళ.. దేశాన్ని అతలాకుతలం చేసేందుకు ఉగ్రవాదులు కుట్రపన్నారా.. అన్నఅనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాలు దేశంలోని ప్రముఖ నగరాలకు ఉగ్రవాద ముప్పు ఉందని హెచ్చరించాయి కూడా. ఈ నేపథ్యంలో సరిగ్గా పండుగకు ముందు రోజుహైదరాబాద్ లో ఇద్దరు సిమి కార్యకర్తలు అరెస్టుకావడం సంచలనం సృష్టిస్తోంది. భారత్‌లో ఉగ్రవాద దాడులకు పాల్పడేందుకు ఆల్ ఖైదా శిక్షణ కోసం ఆఫ్ఘనిస్థాన్ వెళుతున్న ఇద్దరు ఉగ్రవాదులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి జీహాద్ సాహిత్యం, బాంబుల తయారీ ఫార్ములా పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన వీరు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పదంగా తచ్చాడుతుండటంతో అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న విషయం బయటపడింది. జీహాద్ పట్ల ఆకర్షితులైన వీరు.. సామాజిక వెబ్‌సైట్ల ద్వారా జిహాద్ ప్రచారం చేస్తున్నారని తెలిసింది. అంతే కాదు.. ఆల్ ఖైదా, ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులతో నిత్యం టచ్ లో ఉంటూ.. ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నారని తెలిసింది. అంతే కాకుండా స్థానిక హైదరాబాద్ యువతను కూడా ఉగ్రవాదంవైపు ఆకర్షించేందుకు వీరు ప్రయత్నిస్తున్నారట. వీరితోపాటు హైదరాబాద్‌కు చెందిన సిమి మాజీ సానుభూతిపరుడు ముత్తాసిమ్‌ బిల్హా, మరొకరిని అరెస్టు చేశారని వార్తలు వస్తున్నాయి. ఐతే.. వీటిని పోలీసులు ధ్రువీకరించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: