దేశ చరిత్రలోనే అత్యంత భారీ స్కామ్ 2జీ స్కామ్. ఆ స్కామ్ లో పాలు పంచుకొందన్న ఆరోపణలతో డీఎంకే అధినేత కరుణానిధి కుటుంబం ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటోంది. డీఎంకే కు చెందిన రాజా 2జీ స్కామ్ లో కీలకపాత్ర పోషించాడని, కరుణానిధి తనయ కనిమొళికి కూడా ఆ స్కామ్ లో వాటా ఉందనే ఆరోపణలు వినిపించాయి. సీబీఐ చార్జిషీట్ లో కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారు. రాజా, కనిమొళిలు కొన్ని నెలల పాటు తీహార్ జైల్లో గడపాల్సి వచ్చింది. అయితే ఇంకా టూజీ వ్యవహారం ముగియలేదు. ఈ కేసులు విచారణే ఇంకా పూర్తి కాలేదు. అయితే కనిమొళి, రాజా వంటి వాళ్లు బెయిలు మీద బయటకు వచ్చారు. తమ రాజకీయాలను చేసుకొంటున్నారు. అయితే వీరికి ఇప్పుడు అధికార పార్టీ అండలేకుండా పోయింది. సొంత రాష్ట్రం తమిళనాడులో డీఎంకేకి అధికారం చేజారగా.. ఇక కేంద్రంలో కాంగ్రెస్ కూటమి దిగిపోవడంతో డీఎంకే ఒంటరి అయ్యింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా బీజేపీకి దగ్గరవ్వాలని డీఎంకే వాళ్లు భావించారు. అందుకు తగ్గట్టుగా ఒక అంశాన్ని ఆసరాగా చేసుకొన్నారు. కాశ్మీర్ వరదల నేపథ్యంలో విరాళాలు ఇవ్వమన్న ప్రధానమంత్రి పిలుపును పరిగణనలోకి తీసుకొని... మోడీతో మీటింగ్ పెట్టడానికి డీఎంకే వాళ్లు ప్రయత్నించారు. కనిమొళి ఆధ్వర్యంలో ఒక బృందం మోడీని కలిసి పాతిక లక్షల రూపాయల విరాళం ఇవ్వాలని భావించింది. అయితే వీళ్ల ట్రాక్ రికార్డును చూసి మోడీనే భయపడినట్టు గా తెలుస్తోంది. అవినీతి ఆరోపణలున్న వీరితో కలవడం వల్ల చెడ్డపేరు వస్తుందని మోడీ వీరికి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని... సమాచారం! మొత్తానికి మోడీ కూడా చాలా యాక్టివ్ గా, జాగ్రత్తగానే ఉన్నట్టున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: