"అంతా బాగుంది... చాలా బాగా చేశాం.. '' అనిచెప్పదలుచుకొన్నాడు తెలుగుదేశం అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు! విశాఖ తుపానును ఆయన ఆ విధంగానే ఎదుర్కొంటున్నాడు! అద్భుతంగా పనిచేశాం.. తుపాను పరిస్థితులను చాలా గొప్పగా ఎదుర్కొన్నాం అనే సూచనను ఇవ్వడానికి బాబు శతధా ప్రయత్నిస్తున్నాడు. తాజాగా విశాఖలో ప్రభుత్వం పండగ సంబరాలకు కూడా సిద్ధం అయిపోతుండటం అనేక మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది! హుదూద్ తుపాను బాధితులకు ఇప్పటి వరకూ సరిగా సహాయం అందింది లేదు. అసలు కొన్ని గ్రామాలకు ఇప్పటి వరకూ విద్యుత్ పునరుద్ధరణే జరగలేదంటే నమ్ముతారా? ఇక తీవ్రంగా నష్టపోయిన వారి సంగతి అయితే చెప్పనక్కర్లేదు! ఏదో కొన్ని కిలోల బియ్యం... కిరోసిన్ ఇచ్చి చేతులు దులిపేసుకొన్నారు. కనీసం కాంగ్రెస్ హయాంలో కర్నూలు వరదలు వస్తే... అక్కడ బాధితులకు తక్షణ సాయం కింద ఒక్కో కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఇచ్చారు. హుదూద్ తుపాను బాధితులకు అలాంటి ఆర్థిక సాయం అందింది కూడా లేదు! మరి ఇది ప్రభుత్వం తీరు. మరి ఇంతటి దారుణమైన వ్యవహారాలను కూడా ప్రభుత్వం కవర్ చేసుకోవాలని చూస్తోంది! అది కూడా పండగ సంబరాల ద్వారా! బాధితులను వెక్కిరించడం కాకపోతే ఏమిటిదంతా? అధికారులకు సన్మానం, తుపాను బాధితులను రక్షించిన చంద్రబాబు కు సత్కారం.. అక్కడే ఉంది సహాయక చర్యలు ముమ్మరంగా సాగించినందుకు గానూ. .ఈ సత్కారాలు అట! విశాఖలోబీచ్ ఫెస్టివల్, కార్తీక మాస వనభోజనాలను ప్రభుత్వమే దగ్గర ఉండి నిర్వహిస్తోంది! ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ పెద్దలు, మంత్రులు పాల్గొని... ఆల్ ఈజ్ వెల్ అనే విషయాన్ని చాటడానికి ప్రయత్నిస్తున్నారు! మరి తుపాను బాధితులంతా హ్యాపీ అనే విషయాన్ని చాటడానికి ఏపీ ప్రభుత్వం ఇలాంటి యత్నాలు చేస్తోంది. తద్వారా ఏం సాధిస్తుందో చూద్దాం!

మరింత సమాచారం తెలుసుకోండి: