తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో చాలా మందికి C దాన్ని తీసుకెళ్లి సోనియాగాంధీకి సమర్పించారట. దాని ప్రకారం.. పొన్నాలను పీసీసీ పదవి నుంచి తప్పించడం ఖాయమని తెలుస్తోంది. పొన్నాలను ఆ స్థానంలో ఎవరూ ఒప్పుకోవడం లేదని.. ఆయన కూడా పరిస్థితులను అనుకూలంగా మార్చుకోలేకపోతున్నాడని ఇన్ చార్జి నేతలు అభిప్రాయపడ్డారట. ఎలాగూ తెలంగాణ కాంగ్రెస్ లో ఆయనపై వ్యతిరేకత ఉంది... పార్టీ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోతున్నా.. పొన్నాల వారిని అడ్డుకోలేకపోతున్నాడు. బతిమాలోబుజ్జగించో.. వారిని పార్టీలోనే ఉండేలా చూసుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాలన్నింటికీ బాధ్యుడిని చేసి పొన్నాలను తప్పించడానికి రంగం సిద్ధమైందని సమాచారం. అలాగే జిల్లాల కాంగ్రెస్ నేతలుగా కొత్త వారిని నియమించి... మొత్తంగా టీపీసీసీనే పునర్నిర్మించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందని సమాచారం. వివిధ జిల్లాలకు అధ్యక్షులుగా మాజీ మంత్రులను నియమించాలని తాజా నివేదికలో సిఫార్సు చేశారట. మరి ఈ నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నిలదొక్కుకొనేలా చేస్తాయో చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: