మహారాష్ట్రలో తిరిగి బీజేపీతో కలిసే ఆలోచనే లేదని, భవిష్యత్తులో పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, బీజేపీకి మద్దతు ఉపసంహరించినా తాము దగ్గర కాబోమని తేల్చి చెప్పింది. విశ్వాస పరిక్ష సమయంలో ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఆ పార్టీ వమ్ము చేసిందని సోమవారం నాటి సామ్నా పత్రిక సంపాదకీయంలో విమర్శించింది. బీజేపీతో తాము గతంలో నడిపిన సంబంధాలను ఇప్పుడు పునరాలోచించుకోవడం లేదని ప్రకటించింది. గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్, ఎన్సీపీలు రాష్ట్రాన్ని దోచుకు తిన్నాయని, ఇప్పుడు ఎన్సీపీ, బీజేపీలు కలసి అదే పని చేయనున్నాయని ఆరోపించింది. ప్రజలు మార్పు కోరుతూ బీజేపీకి మద్దతిస్తే ఎన్సీపీతో బంధం పెట్టుకొని ఆ పార్టీ ప్రజలను మోసం చేసిందని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: