తప్పుడు ప్రచారంతో తన నిబద్దతను కొనలేరని టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు.మై హోం అధినేత కు కేటాయించిన భూమి పై ప్రభుత్వానికి అదికారికంగా 300 కోట్ల రూపాయల నష్టం జరిగిందని,కాని అనధికార అంచనా ప్రకారం వెయ్యి కోట్ల నష్టం జరిగిందని అన్నారు.శాసనసభ కమిటీ ని నియమిస్తే దానిని రుజువు చేస్తానని రేవంత్ సవాల్ చేశారు. తమ సస్పెన్షన్ లను ఎత్తివేసి చర్చకు అనుమతించాలని,లేదా శాసనసభ కు తాము తిరిగి వచ్చాక చర్చకు అనుమతించాలని స్పీకర్ ను కోరుతున్నామని అన్నారు.రామేశ్వరరావు భూ బదలాయింపులలో అవకతవకలు జరిగాయన్న తన అభియోగాలపై వెనక్కి తగ్గలేదని,దీనికి సంబంధించిన నివేదికను తయారు చేశామని ఆయన చెప్పారు.కాగా స్పీకర్ మదుసూదనాచారిని కూడా రేవంత్ కలిసి మెట్రో భూములను ,రామేశ్వరరావు కు కేటాయించిన వైనంపై చర్చకు అనుమతించాలని అన్నారు.టిడిపిపై కక్ష సాధింపుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని రేవంత్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: