ఎన్‌ఐఏ మంగళవారం అరెస్ట్ చేసింది. ఎన్ ఐఏ అధికారులు ఖలీద్ ను హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి పేలుడు పదార్ధాలతో పాటు బాంబు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 2న జరిగిన పేలుళ్లలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మయన్మార్ కు చెందిన ఖలీద్ హైదరాబాద్ లో తలదాచుకున్నట్లు పక్కా సమాచారం అందుకున్న ఎన్‌ఐఏ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా బుర్ద్వాన్ పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు సాజిద్‌ను పశ్చిమ బెంగాల్ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జెఎంబి) ఉగ్రవాద సంస్థ చీఫ్ కమాండర్ అయిన సాజిద్‌పై నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) రూ. పది లక్షల రివార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ బుర్ద్వాన్ పట్టణంలోని ఖాగ్రాగఢ్‌లోని ఓ ఇంటిలో.. అక్టోబర్ రెండో తేదీన పేలుడు సంభవించి షకీల్ అహ్మద్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. మరో వ్యక్తి సోవన్ మండల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వీరిద్దరికీ జెఎంబి ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: