తమ పార్టీ నుంచి అధికార పార్టీ వైపు వెళ్లిపోతున్న ఎమ్మెల్యేల విషయంలో రచ్చ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. అధికార టీఆర్ఎస్ తమ పార్టీ ఎమ్మెల్యేలకు వల వేస్తోందని.. వారిని ప్రలోభాలకు గురించి తమవైపుకు తిప్పుకొంటోందని.. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. కష్టాకాలంలో ఉన్న పార్టీని వీడి వెళ్లిపోతున్నదీ ఇలాంటి సీనియర్ లీడర్లే! కొంతమంది మాత్రం పార్టీలోనే ఉంటామని అంటూ.. పార్టీ వీడి వెళ్లిపోతున్న నేతల పట్ల ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అయితే వీరికి టీఆర్ఎస్ సమాధానం చెబుతున్న తీరు ఆసక్తికరంగా ఉందిప్పుడు. వెనుకటికి తమ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తనవైపు తిప్పుకొందన్న విషయాన్ని టీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు! అప్పట్లో టీఆర్ఎస్ ను వైఎస్సార్ నిలువునా చీల్చాడనే విషయాన్ని టీఆర్ఎస్ నేతలు ప్రస్తావిస్తున్నారు. సగంమంది ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకొని.. వారినిఐదేళ్ల పాటు ఎమ్మెల్యేల హోదాల్లో కొనసాగించారని.. అలాంటప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ఏ విధంగా ఆందోళన వ్యక్తం చేస్తుందని టీఆర్ఎస్ వాళ్లు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ చేతిలో అధికారం ఉన్నప్పుడు చాలా మంది తమ ఎమ్మెల్యేలు అటువైపు వెళ్లిపోయారని.. ఇప్పుడు తమ వద్ద అధికారం ఉండే సరికి ఎమ్మెల్యేలు తమవైపు వస్తున్నారని.. ఇందులో తప్పేముందని.. ఈ విషయంలో కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేయడం ఏమటని వారు ప్రశ్నిస్తున్నారు. మరి టీఆర్ఎస్ లాజిక్ బాగానే ఉంది. దీనికి కాంగ్రెస్ ఏమని సమాధానం చెబుతుందో మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: