అరబిందో ఫార్మా వైస్ ఛైర్మన్ నిత్యానందరెడ్డిని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం పరామర్శించారు. బుధవారం ఉదయం మార్నింగ్ వాక్ కోసం కేబీఆర్ పార్కుకు వెళ్లిన నిత్యానందరెడ్డిపై గుర్తు తెలియని దుండగుడు కాల్పులకు దిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ దాడిలో నిత్యానందరెడ్డి తృటిలో తప్పించుకున్నారు. దాడితో నిత్యానంద రెడ్డి కుటుంబం షాక్ కు గురైంది. దాడిపై సమాచారం తెలుసుకున్న వెంటనే జగన్, నిత్యానందరెడ్డికి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా దాడి జరిగిన తీరు, నిందితుడి వివరాలను జగన్, నిత్యానందరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు, దాడిపై సమాచారం తెలుసుకున్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నిత్యానందరెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. జగన్ అక్రమాస్తుల కేసులో నిత్యానందరెడ్డి కూడా ఒక నిందితుడిగా ఉన్నారు. మిగిలిన నిందితుల్లా కాకుండా నిత్యానందరెడ్డి, జగన్ సంస్థల్లో తన పెట్టుబడులను సమర్ధించుకుంటున్నారు. లాభాలు ఆశించే జగన్ సంస్థల్లో పెట్టుబడి పెట్టానని, వైఎస్ సర్కారు నుంచి ఎలాంటి లబ్ది పొందలేదని ఆయన కోర్టులో న్యాయపోరాటం సాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: