తెలుగుదేశం అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలోని రాజధాని అధ్యయన కమిటీ జపాన్ వెళ్లడానికి లగేజీ సర్దుకొంటోంది! సింగపూర్ ను ఇంచి ఇంచీ చూసి వచ్చిన ఈ కమిటీ ఇప్పుడు జపాన్ వెళ్లి అక్కడి నగరాలను చూసి రావడానికి రెడీ అవుతోంది. సింగపూర్ స్ఫూర్తితో ఏపీని అభివృద్ధి చేసేస్తామని ఇది వరకే ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు జపాన్ స్ఫూర్తిని సంపాదించడానికి వెళుతోంది! మరి వరసగా విదేశాలను చూసి వచ్చి..అక్కడి అభివృద్ధిని అంతా ఇక్కడ గుమ్మర పోస్తామని అంటున్న బాబు అండ్ బ్యాచ్ వాస్తవంలో ఏం సాధిస్తుందో మాత్రం ఎవరికీ అంతుబట్టడం లేదు. బాబు అండ్ బ్యాచ్ సింగపూర్ కు పయనం అయినప్పుడే విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ సొమ్ముతో ఇలా విదేశీయానాలు చేయడం ఏమిటి? అనే విమర్శలు వచ్చాయి. అసలు సీఎం రమేశ్ వంటి వారు కూడా రాజధాని విషయంలో అధ్యయనం చేస్తారా? అసలు అలాంటి వారంతా ఏ హోదాలతో ప్రభుత్వ సొమ్ముతో విదేశాలకు వెళతారు?! అనే విమర్శలు వచ్చాయి. అయితే బాబు మాత్రం అలాంటి విమర్శలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. తన ట్రూపునంతటినీ సింగపూర్ తీసుకెళ్లిన ఆయన ఇప్పుడు వారినే జపాన్ తీసుకెళ్తున్నాడు! వారం రోజుల పాటు జపాన్ లో పర్యటించనున్నారట. అక్కడ వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి.. నగరాల తీరు తెన్నులను తెలుసుకొని.. అచ్చం అలాంటి అభివృద్ధినే ఇక్కడ సాధిస్తామని బాబు అండ్ బ్యాచ్ హామీ ఇస్తోంది. మరి ఇలాంటి విదేశీ పర్యటనలతో.. ప్రజలను ఎన్ని రోజులు కన్వీన్స్ చేస్తారో చూద్దాం!

మరింత సమాచారం తెలుసుకోండి: