శాసనసభలో తమ ఎమ్మెల్యేల పట్ల డిప్యూటీ స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. సభా వ్యవహారాల మంత్రి హరీశ్ రావు కనుసన్నల్లో అసెంబ్లీ నడుస్తోందని అన్నారు. కాంగ్రెస్ సభ్యులు మాట్లాడుతుంటే మంత్రులు అదేపనిగా మధ్యలో జోక్యం చేసుకుంటున్నారని వాపోయారు. టీఆర్ఎస్ కు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అనుకూలంగా వ్యవహరిస్తుండడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తమ ఎమ్మెల్యే సంపత్ మాట్లాడుతున్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలకిషన్ కు అవకాశమివ్వడం సభా మర్యాదకు వ్యతిరేకమన్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల తీరుపై ఎలా వ్యవహరించాలో సీఎల్పీ సమావేశంలో ఒక విధానం రూపొందించుకుంటామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: