మరి ప్రస్తుతానికి అయితే నరేంద్రమోడీ ప్రధానమంత్రి హోదాలో ఉన్నారు. ఆయన సమర్థుడైన, బలమైన ప్రధానమంత్రిగా పేరు పొందుతున్నాడు. రాబోయే పదేళ్ల వరకూ మోడీని ఆ సీటు నుంచి కదిలించే వాళ్లెవ్వరూ లేకపోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ప్రధానమంత్రి పీఠం మీద ఎవరైనా ఆశలు పెట్టుకొన్నా.. వారు సైలెంటయిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరి ఇటువంటి పరిస్థితుల మధ్య ఒక ముఖ్యమంత్రి తనకు ప్రధానమంత్రి కావాలని ఉందని వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. అది కూడా తను ప్రధానమంత్రిని అవుతానని ఆయన ఆశాభావం వ్యక్తం చేయడం విశేషం! ఇలా ప్రధానమంత్రి పీఠంపై తన ఆశలను బయటపెట్టుకొన్న వ్యక్తి బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంజీ. తను ఎన్నో కష్టాలకు ఓర్చుకొని బీహార్ ముఖ్యమంత్రిని అయ్యాయనని మాంజీ చెప్పుకొచ్చారు. ఇలాంటి కష్టాలు మరిన్ని పడి ప్రధానమంత్రి కావలన్నదే తన అభిలాష అని ఆయన వివరించారు! మరి ఈ మధ్య కాలంలో మాంజీ చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాంటి వాటితోనే వార్తల్లోకి వచ్చాడు. ఇటువంటి నేపథ్యంలో ఆయన తనకు ప్రధానమంత్రి కావాలని ఉందనే కోరికను బయటపెట్టుకోవడం కొంత హాస్యాస్పదం అవుతోంది. జీతన్ కుబీహార్ ముఖ్యమంత్రి పదవే కొన్ని విచిత్రమైన పరిణామాల మధ్య లభించింది. సార్వత్రిక ఎన్నికల్లో బీహార్ లో తమ పార్టీ బోల్తా పడటంతో నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామ చేయడంతో ఆ స్తానంలోకి జీతన్ వచ్చాడు. మరి ఇలాంటి జాక్ పాట్ సీఎం ప్రధానమంత్రి కావాలంటే.. ఎవరు రాజీనామా చేయాలో!

మరింత సమాచారం తెలుసుకోండి: