ఎపి రాజధాని కి భూమి సమీకరణ భూములు ఇచ్చే రైతులకు ప్లాట్లను లాటరీ ద్వారా అంద చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. తుళ్లూరు,మంగళగిరి మండలలోని ఇరవై తొమ్మిది గ్రామాలను రాజధాని గా ప్రభుత్వం ఎంపిక చేసింది. దీని ప్రకారం సుమారు లక్షన్నర మంది జనాభా నిర్వాసితులు అవుతారని అంచనా వేశారు.వీరిలో కూడా చిన్న,సన్నకారు రైతులే అధికంగా ఉండడం విశేషం.ఐదు ఎకరాలు మించి భూములు ఉన్నవారు ఐదు శాతం మేరే ఉండగా,మిగిలినవారంతా ఐదెకరాల లోపువారే. వీరిలో సుమారు ముప్పైవేల మంది ఎస్.సి,ఎస్టివర్గాల వారు ఉన్నారు. భూములు ఇవ్వడానికి సిద్దపడినవారు తమకు అభివృద్ది చేసిన ప్లాట్లను తాము ఉన్నచోట,లేక తాము కోరుకున్న చోట ఇవ్వాలని కోరుతున్నారు.కాని ప్రభుత్వం ఎంపిక చేసిన అభివృద్ది ప్రాంతాలలో ,నిర్దేషిత ప్రాంతాలలో ఈ ప్లాట్లను కేటాయించాలని రాజధాని అబివృద్ది సాధికార సంస్థ బిల్లులో పేర్కొంది.ఎకరా భూమి ఇచ్చినవారికి వెయ్యి గజాల మేర అబివృద్ది చేసిన ప్లాట్ ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది.అయితే రైతులు అబివృద్ది చేసిన భూమిని మరో 200 గజాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: