ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తక్కువ సమయంలోనే రెండో విదేశీ పర్యటనకు వెళ్లింది. సింగపూర్ తో ప్రారంభమైన విదేశీ యాత్రల సీరిస్.. ప్రస్తుతం జపాన్ కు చేరింది. ఈ నెల 29వ తేదీ వరకూ అంటే దాదాపు 6 రోజుల పాటు చంద్రబాబు జపాన్లో ఉంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు 18 మంది అధికారిక బృందం వెళ్లింది. మరో 40మంది వరకూ పారిశ్రామికవేత్తలు వ్యక్తిగతంగా వీరి వెంట జపాన్ వెళ్లారు. సింగపూర్ టూర్ తరహాలోనే జపాన్ ప్రభుత్వ నేతలు, మంత్రులతో పాటు జపాన్ లోని ప్రముఖ కంపెనీల సీఈవోలతో సమావేశమై ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరతారు.                                                       పానాసోనిక్, మిత్సుబిషి, తోషిబా తదితర ప్రముఖ సంస్థలతో చంద్రబాబు సమావేశమవుతారు. తొలిరోజు వ్యవసాయ యంత్రాలు, పరికరాలు వ్యాపారం చేసే సంస్థ ప్రతినిధులతో సమావేశం అవుతారు. తర్వాత ప్రముఖ ఎలక్ట్రిక్ మోటార్లు తయరీ సంస్థ NTEC ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమై ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరిస్తూ వీడియో ప్రదర్శన ఇస్తారు. 25న తేదీన జపాన్ లోని మూడో అతిపెద్ద నగరం ఒసాకా వెళ్తారు. అక్కడ పానాసోనిక్ కార్పొరేషన్ ప్రతినిధులతో సమావేశమవుతారు. ఒసాకా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమావేశంలో ప్రసంగిస్తారు. క్యోటోలో ఇండియా ఐటీ పోరం ఇచ్చే విందులో పాల్గొంటారు. ఆ నగర మేయర్ తో సమావేశం కానున్నారు. అడ్వాన్స్ డ్ కెమికల్ టెక్నాలజీ సెంటర్ ను సందర్శించి... రాత్రికి పుకువోకా నగరానికి వెళ్తారు.                                  26న పుకువోకా నగరంలోని వ్యర్థాల నియంత్రణ వ్యవస్థను పరిశీలిస్తారు.మధ్యాహ్నం కిటాక్యుషు నగరానికి వెళ్లి ఫుజి ఎలక్ట్రిక్ కంపెనీని సందర్శిస్తారు. 27న తేదీన జపాన్ ప్రధానమంత్రితో పాటు వివిధ శాఖల మంత్రులతో సమావేశం అవుతారు. ఇసుజు కార్పొరేషన్ ఎండీతో భేటీ అవుతారు. తర్వాత సుమిటిమో కార్పొరేషన్ ప్రతినిధులతో, నేషనల్ న్యూ ఎనర్జీ అండ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ తో సమావేశమవుతారు. అదే రోజు యొకొహమా నౌకాశ్రయాన్ని సందర్శించి పోర్టుల అభివృద్ధిని అధ్యయనం చేస్తారు.28న తేదీన ఇసెకి అండ్ కంపెనీ తో పాటు మిత్యుబిషి హిటాచి తదితర సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు గల అవకాశాలపై నిర్వహించే సదస్సులో పాల్గొంటారు. 29న హైదరాబాద్ కు తిరిగివస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: