సెక్యూరిటీ తనకు ఎందుకు కల్పించారో చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీ సతీమణి జశోదాబెన్ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. సెక్యూరిటీగా వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలని కోరారు. ప్రోటోకాల్ ప్రకారం ఎలాంటి సదుపాయాలు వస్తాయో కూడా చెప్పాలన్నారు. మరోవైపు జశోదాబెన్ దరఖాస్తుకు త్వరలోనే సమాధానమిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సతీమణి జశోదాబెన్ గుజరాత్-లోని మెహసానా జిల్లా ఉంజా పట్టణంలోని తన సోదరుని నివాసంలో వుంటున్నారు. మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆమెకు జిల్లా పోలీసులు భద్రత కల్పించారు. పది మంది రక్షణ సిబ్బంది రెండు షిప్టుల్లో పనిచేస్తున్నారు. తనకు సెక్యూరిటీ వద్దని ఆమె చెప్పినా ప్రభుత్వం వెనక్కివెళ్ళలేదు. ఇంతకాలం మీడియాకు మొహం చూపడానికి కూడా ఇష్టపడని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సతీమణి జశోదాబెన్ ఇటీవల బయటకు రావడం మొదలుపెట్టారు.  మొన్ననే ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె మా ఆయన పిలిస్తే నేను వెళ్లిపోతాను అని చెప్పారు. తాజాగా తనకు ఎలాంటి భద్రత ఇవ్వాల్సి ఉంది, ఎలాంటి భద్రత ఇస్తున్నారనే విషయాలపై సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నారు జశోదాబెన్. తాను పీఎం భార్యనే కావచ్చు కానీ తనకు సెక్యూరిటీ అవసరమా? అని ఆమె ప్రశ్నించారు. తాను పబ్లిక్ ట్రాన్స్-పోర్ట్-లో ట్రావెల్ చేస్తుంటే, సెక్యూరిటీ వాళ్ళు అఫీషియల్ వెహికల్స్-లో ట్రావెల్ చేస్తున్నారన్నారు. మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని సెక్యూరిటీ పర్సన్స్ కాల్చి చంపారు. తాను కూడా ఇప్పుడు అలాంటి భయాన్నేఎదుర్కొంటున్నాననీ, అందు కోసమే తనకు కేటాయించిన సెక్యూరిటీ వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వలని అప్లికేషన్-లో జశోదా స్పష్టం చేశారు. ప్రోటోకాల్ ప్రకారం తనకు ఇంకేం సదుపాయాలు వస్తాయో చెప్పాలని కూడా జశోదాబెన్ ఆర్టీఐ దరఖాస్తులో కోరడం విశేషం. మరోవైపు ఆమె దరఖాస్తుకు త్వరలోనే సమాధానమిస్తామని పోలీసులు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: