చంద్రబాబు జపాన్ ఎందుకు వెళ్లారు.. పెట్టుబడులు ఆకర్షించడం కోసం.. రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలు వివరించడం కోసం.. అందుకే తన వెంట ఏపీ అధికారులను, మంత్రులను వెంట తీసుకెళ్లారు. అక్కడి పరిశ్రమల అధిపతులతోనూ.. అధికారులతోనూ మంతనాలు సాగిస్తున్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ బాబు వెంట అధికారులు, మంత్రులు కాకుండా వేరేవారు కూడా జపాన్ వెళ్లడంపై విమర్శలు వస్తున్నాయి.                           ఇంతకీ ఆయనెవరనేగా మీ సందేహం. ఆయన పేరు నందమూరి వెంకట రమణ కుమార్. ఆయన విశాఖ ఎమ్మెల్యే రామకృష్ణబాబు వర్గీయుడు. పార్టీపరంగా పెద్దగా లింకు లేకపోయినా.. ఎమ్మెల్యే లిక్కర్ వ్యాపారాల్లో వెంకట రమణ కుమార్ బిజినెస్ పార్ట్ నర్. లిక్కర్ వ్యాపారాలు చూసుకునే వెంకట రమణకుమార్.. చంద్రబాబు బృందంతో కలసి జపాన్ వెళ్లడం కలకలం సృష్టిస్తోంది. నందమూరి కుటుంబీకులకు దూరపు బంధువునని చెప్పుకునే రమణ కుమార్ జపాన్ టూర్ టికెట్ సంపాదించడం చర్చనీయాంశమైంది.                        ఓ లిక్కర్ వ్యాపారిను చంద్రబాబు జపాన్ టూర్ కు ఎందుకు తీసుకెళ్లారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు వెంట అధికారులు, మంత్రులతో పాటు కొందరు పారిశ్రామిక వేత్తలు కూడా వెళ్లారు. కానీ వారు రమణ కుమార్ లా మరీ లిక్కర్ వ్యాపారులు కారు. మరి లిక్కర్ వ్యాపారికి జపాన్ లో ఏం పని.. అందులోనూ ప్రభుత్వ అధికారులతో కలసి ఎలా జపాన్ వెళ్లారు.. ఇప్పుడీ ప్రశ్నలు ఆసక్తిరేపుతున్నాయి. మరి దీనిపై టీడీపీ ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: