అధికారం చేతిలో ఉన్న రోజుల్లో చేసిన ఒక భూ కబ్జా ఇప్పుడు టీ.పీసీసీ అధ్యక్షుడు పొన్నాల మెడకు చుట్టుకొనేలా ఉంది. తొమ్మిది ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ను పొన్నాల కబ్జా చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి , ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఈ అంశం గురించి సభలో చర్చను లేవనెత్తుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల ఇరకాటంలో పడ్డాడని తెలుస్తోంది. మరి ఈ అంశం సభలో చర్చకు వస్తే... పొన్నాల పరిస్థితి ఏమిటో అర్థంకావడం లేదు. ఆయన తరపున సభలో పోరాడేది ఎవరో అంతుబట్టకుండా ఉంది. పొన్నాల విషయంలో తాము వకాల్తా పుచ్చుకొనేదేమీ ఉండదని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాదాపుగా స్పష్టం చేశారు. టీ.సీఎల్పీ ఉపాధ్యక్షుడు కోమటిరెడ్డి మాట్లాడుతూ ఈ అంశాన్ని స్పష్టం చేశాడు. పొన్నాల తరపున తాము వాయిస్ వినిపించమని ఆయన అంటున్నాడు. అవినీతి విషయంలో సహించేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేస్తున్నాడని, ఈ విషయంలో తన ఇంట్లో వాళ్ల విషయంలో కూడా ఎలాంటి సహనం ఉండదని ఆయన అంటున్నాడని, ఇలాంటి సమయంలో భూ కబ్జా వ్యవహారంలో పొన్నాల తరపున తాము ఎలా వాదించగలమని కోమటిరెడ్డి ప్రశ్నిస్తున్నాడు. మరి ఈ యన లాజిక్ బాగానే ఉంది. మరి పాత ప్రభుత్వ వ్యవహారాల విషయంలో కాంగ్రెస్ నేతలు వకల్తా పుచ్చుకొంటారు. కాంగ్రెస్ హయాంలో అంతా మంచే జరిగిందని అంటారు. మరి పొన్నాల వ్యవహారంలో మాత్రం వాయిస్ వినిపించమని అంటున్నారు. మరి పీసీసీ అధ్యక్షుడిని ఇప్పుడు రక్షించేది ఎవరో!

మరింత సమాచారం తెలుసుకోండి: