హుదూద్ తుపాను విషయంలో కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. తాము ఈ విషయంలో ఇంతకన్నా ఎలాంటి సాయం చేయలేమని స్పష్టం చేసింది. హుదూద్ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది! దీంతో హుదూద్ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటిస్తారు, కేంద్రం నుంచి అపారమైన సాయం అందుతుంది అని పెట్టుకొన్న ఆశలు ఏమైనా ఉంటే అవి కాస్తా నీరుగారాయి. తుపాను విషయంలో కేంద్రం నుంచి ప్రత్యేకమైన సాయం ఉండదని స్పష్టం అయ్యింది. జాతీయ విపత్తుగా ప్రకటించి ఉంటే.. మంచి స్థాయిలోసాయం అందేది. ఇక అలాంటి అవకాశాలు ఏమీ లేవని స్పష్టం అయ్యింది. ప్రధానమంత్రి విశాఖ ప్రాంతంలో పర్యటించి వచ్చాడని, వెయ్యి కోట్ల రూపాయల తక్షణ సాయం ప్రకటించి వచ్చాడని కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రకటించింది. ఇంతకన్నా ఏం కావాలని ప్రభుత్వం అంటోంది! మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హుదూద్ విషయంలో చాలా డిమాండ్లనేచేసింది. తక్షణ సాయం కిందే రెండు వేలకోట్ల రూపాయలు ప్రకటించాలని కోరింది. అయితే కేంద్రం మాత్రం వెయ్యి కోట్ల రూపాయలు ప్రకటించింది అందులో ఆరువందల కోట్ల రూపాయలు విడుదల చేసి చేతులు దులుపుకొంటోంది. ఇక ఇదేనేమో హుదూద్ కు అందిన సాయం! మరి కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా ఏపీ ప్రభుత్వానికి తుపాను విషయంలో కూడా షాక్ నే ఇచ్చినట్టుగా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: