ఇప్పటిదాకా ఆస్తులు వెల్లడించని బీజేపీ ఎంపీలంతా 48 గంటల్లోగా తమ ఆస్తుల చిట్టాను పార్లమెంట్ వెబ్ సైట్ లో ప్రత్యక్షమయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం మోదీ నేపాల్ రాజధాని ఖాట్మండూ బయలుదేరిన తర్వాత నల్లధనంపై పార్లమెంట్ లో విపక్షాలు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీలందరూ తమ ఆస్తుల చిట్టాలను పార్లమెంట్ సెక్రటేరియట్ కు అందించడమే కాక దగ్గరుండి మరీ సదరు జాబితాలు పార్లమెంట్ అధికారిక వెబ్ సైట్ లో ప్రత్యక్షమయ్యేలా చూసుకోవాలని ఆయన నేపాల్ నుంచే ఆదేశాలు చేశారు. నల్లధనంపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఇరుకునపెట్టేందుకు యత్నిస్తున్న నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేసేందుకే మోదీ ఈ మేరకు నిర్ణయించినట్లు సమాచారం. మోదీ ఆదేశాలతో పార్టీ ఎంపీల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: