శంషాబాద్ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్-కు ఎన్టీఆర్ పేరు తొలగించడం అసంభవమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో ప్రకటించారు. అయితే ఎయిర్-పోర్టుకున్న రాజీవ్-గాంధీ పేరును తొలగించలేదని, పౌర విమానయాన శాఖ మంత్రి అశోక గజపతిరాజు రాజ్యసభలో స్పష్టంచేశారు. రాజీవ్-గాంధీని కించపరచేందుకే పనిగట్టుకుని హైదరాబాద్ డొమెస్టిక్ టెర్మినల్ పేరును ఎన్టీఆర్ టెర్మినల్-గా మార్చారని మరోవైపున కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో ధ్వజమెత్తింది. అసలు తెలంగాణ సర్కారును సంప్రదించకుండానే పేరు మార్చే అత్యవసర పరిస్థితులు ఏమి వచ్చాయని కాంగ్రెస్ సభ్యులు రాపోలు ఆనందభాస్కర్, ఆనంద్ శర్మ సభలో కేంద్రాన్ని నిలదీశారు. పేరు మార్చడం వెనుక కుట్ర ఉందని ఆనంద్ శర్మ సభలో ఫైర్ అయ్యారు. ఈ అంశంపై చర్చకు తాను నోటీసిచ్చానని ఆనంద్ శర్మ సభలో చెప్పగా అలాంటి నోటీసేదీ అందలేదని డిప్యూటీ ఛైర్మన్ కురియన్ చెప్పారు. దీంతో ఆనంద్ శర్మ-డిప్యూటీ ఛైర్మన్-కు మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. కాంగ్రెస్ సభ్యులు ఛైర్మన్ పోడియం వద్దకు ప్లకార్డులతో దూసుకువచ్చి నినాదాలు చేశారు. దీంతో సభను అరగంట పాటు వాయిదా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: