రాష్ట్ర విభజనతో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగుతుందని... సీట్ల సంఖ్య పెరుగుతందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రాలో ఇలా నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయిత అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన గురించి ఇప్పటి వరకూ ప్రకటన ఏమీ లేదు. ఎన్నికల సమయానికి ఈ విషయం గురించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి ఆ సంగతి అలా ఉంటే.. అంతలోపే ఆంధ్రాలో ఎమ్మెల్సీల సంఖ్య పెరగబోతోందట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మొత్తం 50 మంది ఎమ్మెల్సీలు ఉండగా.. ఈ సంఖ్య 58 కి పెరిగే అవకాశం కని పిస్తోంది. ఈ మేరకు లోక్ సభలో ఒక బిల్లుకు ఆమోదం లభించనుందనే వార్తలు వస్తున్నాయి. ఏపీ శాసన మండలి సీట్ల సంఖ్యను పెంచే అంశం ప్రస్తుత సమావేశాల్లోనే చర్చకు వచ్చే అవకాశం ఉందట. దానికి సులభంగానే ఆమోదం పడవచ్చని తెలుస్తోంది. మరి అదే జరిగితే ఈ నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులు ఏపీలోని రాజకీయ నిరుద్యోగులకు వరప్రదమే అవుతాయని చెప్పవచ్చు!

మరింత సమాచారం తెలుసుకోండి: