భూవనేశ్వర్ లో ఇండియా పాకిస్తాన్ ల మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్ లో పాక్ జట్టు విజయం సాధించింది. మరి వారి విజయం సంగతి ఎలా ఉన్నా.. మ్యాచ్ ముగిసిన తర్వాత వారు వ్యవహరించిన తీరుపై మాత్రం భారీ చర్చే జరుగుతోంది. పాకిస్తాన్ ఆటగాళ్లు మరీ దారుణంగా వ్యవహరించారు. మైదానంలోనే వారు షర్ట్స్ విప్పి.. ప్రేక్షకులవైపు చూస్తూ వెకిలి చేష్టలు చేశారు. అంత వరకూ భారత్ కు మద్దతు పలికిన ప్రేక్షకుల పట్ల పాక్ ఆటగాళ్లు అలా వ్యవహరించారు. మరి భారత్ వేదికగా జరిగిన మ్యాచ్ కాబట్టి ఇక్కడ సహజంగానే ఇండియా జట్టుకు గట్టి మద్దతు ఉంటుంది. భారీ సంఖ్యలో హాజరైన భారత ప్రేక్షకులు ఇండియా ఫ్లాగ్స్ తో ఆటగాళ్లకు మద్దతుగా నిలిచారు. ఏ దేశంలోనైనా ఇలాంటి వాతావరణమే ఉంటుంది. అయితే పాక్ ఆటగాళ్లు మాత్రం దీన్ని సహించలేకపోయారు. మ్యాచ్ లో విజయం సాధించే సరికి వారికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ప్రేక్షకులపై వైపు కసి చూశారు. షర్ట్స్ లు విప్పారు. చేతులతో వెకిలి సంజ్ఞలు చేశారు. మరి ఈ తీరు విమర్శల పాలవుతుంది. టోర్నీ నిర్వాహకులు.. హాకీ సంఘాలు పాక్ ఆటగాళ్ల తీరును ఖండించారు. ఆఖరికి పాకిస్తాన్ కోచ్ మీడియా ముందుకు వచ్చి.. ఆటగాళ్ల తరపున క్షమాపణలు చెప్పి పరిస్థితిని సరిదిద్దేందుకు ప్రయత్నించాడు. ఏమైతేనేం.. తాము పాకిస్తాన్ వాళ్లమని ఆటగాళ్లు నిరూపించుకొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: