ఒకవైపు టీటీడీ డబ్బులో కూడా తెలంగాణ ప్రభుత్వం వాటా అడుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో దేవాదాయ శాఖకు టీటీడీ డబ్బు అప్పు పడిందని... ఇప్పుడు డబ్బును టీటీడీ చెల్లించాల్సిందేనని.. అందులో తమ వాటాను ఇవ్వాలని తెలంగాణ మంత్రులు కోరుతుఉన్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం తమకు రావాల్సిన డబ్బు విషయంలో ఇలా వ్యవహరిస్తూ ఉంటే..ఏపీ ప్రభుత్వం ఇప్పుడెలా వ్యవహరిస్తుందనేది ఆసక్తి కరంగా మారింది. తెలంగాణ గవర్నమెంటుకు టీటీడీ నుంచి డబ్బు రావాల్సి ఉంటే... ఏపీ గవ్నమెంటుకు పోలీసు శాఖ నుంచి డబ్బు రావాల్సి ఉంది. హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు రాసిన చాలాన్ ల మొత్తం 80 కోట్ల రూపాయలు వసూలు కావాల్సి ఉందని తెలుస్తోంది. దాదాపు ఐదు సంవత్సరాల నుంచి పెండిండ్ లో ఉన్న ఈ మొత్తంలో ఏపీ వాటా కూడా ఉంటుంది! అది కూడా 58 శాతం. మొత్తం సొమ్ములో 58 శాతం ఏపీది కాగా.. 42 శాతం తెలంగాణది అవుతుంది. మరి ఈ సొమ్ములో తెలంగాణ ప్రభుత్వం ఏపీ వాటా ఇస్తుందా? ఇవ్వదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఏపీ ప్రభుత్వం నుంచి అయితే ఇప్పటి వరకూ ఈ డబ్బు గురించి స్పందన లేదు. తెలంగాణ వాళ్లు మాత్రం తమకు రావాల్సిన సొమ్ము విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నా.. ఏపీ గవర్నమెంటు మాత్రం ఇలాంటి వ్యవహారాల గురించి తెలంగాణకు ధీటుగా స్పందించడం లేదు. మరి ఏపీకి ఈ సొమ్ములో వాటా అందుతుందో లేదో!

మరింత సమాచారం తెలుసుకోండి: