ఉత్తరాదిన మత పునఃమార్పిడి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. చాలా ఏళ్ల క్రితం ముస్లిం మతం స్వీకరించిన హిందువులను తిరిగి హైందవంలోకి స్వాగతించే కార్యక్రమాన్ని 'ఘర్ వాపసీ'గా పేర్కొంటున్నారు. తాజాగా, విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) ఈ కార్యాచరణను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నియోజకవర్గం రాయ్ బరేలీలో అమలు చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన చేసింది. వీహెచ్ పీ రాయ్ బరేలీ జిల్లా యూనిట్ చీఫ్ హరీశ్ చంద్ర శర్మ మాట్లాడుతూ, 60 కుటుంబాలు పునఃమార్పిడికి సిద్ధంగా ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. వారిని తామేమీ ప్రలోభాలకు గురిచేయడంలేదని, బలవంతం చేయడంలేదని శర్మ స్పష్టం చేశారు. అనంతరం, 100 కుటుంబాలను 'ఘర్ వాపసీ'లో భాగంగా తిరిగి హిందూ మతంలోకి తీసుకురావాలనుకుంటున్నామని వివరించారు. తమ 'ఘర్ వాపసీ' కార్యక్రమానికి కొన్ని కుహనా లౌకికవాద పార్టీలు మతం రంగు పులుముతున్నాయని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: