తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మరణించారు. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహించిన తిరుపతి నియోజకవర్గానికి ఉప ఎన్నిక తప్పదు. ఇక తెలంగాణలో తలసాని రాజీనామాతో సనత్ నగర్ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరగనుంది! దీంతో రెండు రాష్ట్రాల్లోనూ ఉప ఎన్నికలు జరగనున్నాయని చెప్పవచ్చు. వీటిలో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల సానుభూతి కోటాలో జరగనుందని చెప్పవచ్చు. మానవతా దృక్పథంతో ఈ నియోజకవర్గంలో ఏకగ్రీవ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా వెంకటరమణ కుటుంబీకులు ఎవరైనా నిలబడితే వారి విజయానికి సహకరించవచ్చు. అలాగక వేరే వాళ్లు ఎవరైనా నిలబడితే మాత్రం పోలింగ్ కే అవకాశం ఉంది! ఇక సనత్ నగర్ లో మాత్రం భారీ స్థాయి పోరే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అన్ని పార్టీలూ తలపడతాయి. తెలంగాణ రాష్ట్ర సమితి తరపున తలసాని బరిలో దిగడం దాదాపు ఖాయమే. ఇక తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ మరో అభ్యర్థిని రెడీ చేసుకొని తన సత్తాను చాటే అవకాశం ఉంది. కాంగ్రెస్ తరపున ఇక్కడ ఎలాగూ మర్రిశశిధర్ రెడ్డి ఉండనే ఉన్నాడు! వైఎస్సార్ కాంగ్రెస్ తరపున మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన వెల్లాల రామ్మోహన్ కూడా పోటీ చేసే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో తెరాస , తెదేపా, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ ల నడుమ సనత్ నగర్ లో ఆసక్తికరమైన పోటీ ఉంటుంది!

మరింత సమాచారం తెలుసుకోండి: