వెనుకటికి హోం శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనైతేనేమీ, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అయితేనేమీ... చిదంబరం హవా ఒక రేంజ్ లో ఉండింది. వివిధ అంశాల కేసుల వ్యవహారాల్లో విచారణ జరుపుతున్న సీబీఐ, ఈడీ వంటి సంస్థలను చిదంబరం ఒంటిచేత్తో ఆడించిన దాఖలాలున్నాయి! జగన్ కేసులో సీబీఐ ఉరుకుపరుగుల మీద విచారణను కొనసాగించిందంటే.. దాని వెనుక చిదంబరం ప్రోద్భలం చాలా ఉందని వార్తలు వచ్చాయి. అలాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చిదంబరాన్ని మచ్చిక చేసుకొని సీబీఐ విచారణ మొదలు కానీయకుండానే చూసుకొన్నాడనే ఆరోపణలూ వినిపించాయి. ఇలా ప్రభుత్వ రంగ విచారణ సంస్థలను అదుపు చేసిన చిదంబరానికి ఇప్పుడు ఇబ్బంది వచ్చేసింది! సీబీఐ ఇప్పుడు చిద్దూనే విచారించేస్తోంది. ఈయన వ్యవహారాలపై ప్రశ్నల పరంపర సంధిస్తోంది! ఎయిర్ సెల్- మ్యాక్సిస్ ఒప్పందంలో నాటి ఆర్థిక మంత్రిగా చిదంబరరం పాత్ర గురించి సీబీఐ విచారిస్తోంది. వందల కోట్ల స్కామ్ గా ఉన్న ఈ వ్యవహారంలో చిదంబరం కీలకమైన పాత్ర పోషించినట్టుగా తెలుస్తోంది. చట్ట ప్రకారం ఆరువందల కోట్ల రూపాయల విలువైన స్థాయి ఒప్పందాలకు మంత్రి హోదాలో ఉన్నవారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వవచ్చునట. ఆ పై స్థాయి ఒప్పందాలు ఏమైనా ఉంటే వాటికి క్యాబినెట్ అప్రూవల్ కావాలి. అయితే చిద్దూ మాత్రం అదేమీ పట్టించుకోండా 3,500 కోట్ల రూపాయల విలువైన వ్యవహారాన్ని ఒంటిచేత్తో డీల్ చేశాడు. క్యాబినెట్ కు సమాధానం చెప్పకుండా తనే నిర్ణయాలను తీసేసుకొన్నాడు. మరి ఇది తప్పే కదా! దీంతో సీబీఐ చిద్దూ వెంట పడిందిప్పుడు. మరి ఈ తలనొప్పిని చిద్దూ ఎలా వదిలించుకొంటాడో!

మరింత సమాచారం తెలుసుకోండి: