రామోజీ వర్సస్ కేసీఆర్.. అదేంటీ మొన్నే కదా.. కేసీఆర్ రామోజీ ఇంటికి వెళ్లారు.. ఆయనతో కలసి భోంచేశారు. ఫిలింసిటీ అంతా ఇద్దరూ కలియతిరిగారు.. కలిసి ఫొటోలకు ఫోజులు కూడా ఇచ్చారు. ఇద్దరికీ మధ్య రాజీ కుదిరిందని లోకమంతా కోడై కూస్తుంటే.. అంతలోనే వారికి మధ్య పోటీ ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా.. దోస్తీ దోస్తీయే.. పోటీ పోటీయే.. కాకపోతే ఈ పోటీ అంత హాట్ కాదు..                                     అసలు విషయం ఏమిటంటే.. రామోజీ కొత్తగా ఓం సిటీ పేరుతో ఆధ్యాత్మిక నగరి కట్టబోతున్న విషయం తెలిసిందే. దేశంలోని ప్రముఖ దేవాలయాలను అదే కొలతలతో నిర్మింస్తారు... అంతేకాకుండా నిత్యపూజలు కూడా చేస్తారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇందులో భాగంగా.. 600 అడుగలు ఎత్తైన హనుమాన్ విగ్రహం కూడా నిర్మించబోతున్నారు. ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహమని చెబుతున్నారు. ఇలాంటి విశేషాలు ఈ ఓం సిటీలో ఎన్నో ఉన్నాయి.                                మరోవైపు కేసీఆర్ కూడా యాదగిరిగుట్ట్నను వాటికన్ సిటీ తరహాలో డెవలప్ చేస్తామని చెబుతున్నారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా.. తరచూ యాదగిరిగుట్టను సందర్శిస్తూ.. పురోగతిపై సమీక్షలు జరుపుతున్నారు. బుధవారం కూడా కేసీఆర్ యాదగిరిగుట్టకు వెళ్లారు. తిరుపతి తరహాలో యాదగిరిగుట్టను డెవలప్ చేయాలన్నది కేసీఆర్ డ్రీమ్ గా చెబుతున్నారు. కేసీఆర్ యాదగిరిగుట్ట..- రామోజీ ఓం సిటీ.. ఇద్దరూ ఈ పనుల్లో బిజీగా ఉన్నారు. మరి ఈ రేసులో ఎవరు సక్సస్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: