తెలంగాణలో పార్టీ బాధ్యతలు నారా లోకేష్ చేతిలో ఉన్నాయని తెలుగుదేశం నేతలు చెబుతుంటారు. పార్టీ అధినేత అయిన చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో తెలంగాణ బాధ్యతలను చినబాబు తీసుకొన్నాడని తెలుస్తోంది. ఈ మేరకు రకరకాల కథనాలు కూడా వస్తున్నాయి. అయితే ఇప్పుడు తెలంగాణ బాధ్యతల విషయంలో నారా లోకేష్ పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యాడని టాక్! ఇందుకు తెలుగుదేశం పార్టీ చెబుతున్న లెక్కలే ఆధారం. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టిన విషయం తెలిసిందే. జీవిత భీమా, ఉచిత ప్రయాణ సౌకర్యాలు, ఉచితవైద్యం వంటి ఆఫర్లను ఇచ్చి మరీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలను ఇచ్చింది. దీనికి మంచిస్పందనే వచ్చిందని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. తాము 20 లక్షల సభ్యత్వాలను లక్ష్యంగా పెట్టుకొంటే సభ్యత్వాల సంఖ్య 40 లక్షలు దాటిందని తెలుగుదేశం నేతలు చెప్పుకొచ్చారు. మరి ఇంత వరకూ బాగుంది కానీ ఆ సభ్యత్వాల విషయంలో తెలంగాణ సంఖ్య కేవలం ఐదు లక్షలు మాత్రమేనట! తెలంగాణలోని పది జిల్లాల్లోనూ కలిపి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సభ్యత్వాల సంఖ్య 5 లక్షలు మాత్రమే. ఏపీలోని 13 జిల్లాల్లో 35 లక్షలు సభ్యత్వాలు ఇచ్చారు. మరి తెలంగాణలో మాత్రం చాలా చాలా తక్కువ! ఇటువంటి నేపథ్యంలో తెలంగాణలో పార్టీ మళ్లీ కోలుకొంటుందంటే.. నమ్మడం చాలా కష్టం అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఒకవైపు అధినేత అప్పుడప్పుడు చెబుతుంటాడు తెలంగాణలో అధికారం సాధిస్తామని.. మరీ ఇంత వీక్ అయితే అధికారం ఎలా అందుతుంది?!

మరింత సమాచారం తెలుసుకోండి: