తన 58 వయేటా పెళ్లి చేసుకొని వివాహబంధంలోకి అడుగుపెట్టింది అమెరికన్ టెన్నిస్ స్టార్ మార్టినా నవత్రిలోవా. ఇది తనకు తొలి వివాహం అని ఆమె ప్రకటించుకొంది. మరి ఇంత లేటు వయసులో ఆమె పెళ్లి చేసుకోవడం ఒక విశేషం అయితే ఆమె పెళ్లి చేసుకొంది ఒక మహిళను కావడం అత్యంత విడ్డరమైన విషయం. మార్టినా నవత్రిలోవాకు ఇండియాతో కొంత అనుబంధం ఉంది. భారత టెన్నిస్ ఆటగాళ్లతో కలిసి ఆమె మిక్స్ డ్ డబుల్స్ ఆడేది. భారత ఆటగాళ్లతో ఈ అమెరికన్ స్టార్ క్రీడాకారిణిది విజయవంతమైన జోడీ. కొంతకాలం కిందట ఆట నుంచి రిటైర్ మెంట్ తీసుకొంది నవత్రిలోవా. ఇప్పుడు తీరిగ్గా పెళ్లి చేసుకొంది. 2006లో తను లెస్బియన్ ను అనే విషయాన్ని ప్రకటించింది ఈ టెన్నిస్ క్రీడాకారిణి. అప్పట్లో అది సంచలనం అయ్యింది. మార్టినా కుటుంబం కూడా ఆమెను సపోర్ట్ చేయలేదు. తనకు ఆడవాళ్లతో జతకట్టడమే ఇష్టం అని అప్పట్లో మార్టినా ధ్రువీకరించడం వివాదస్పదం అయ్యింది. అప్పటి నుంచినే మార్టినా లెమిగోవా అనే ఒక మహిళతో సహజీవనం కొనసాగిస్తోంది. తాజాగా వీళ్లిద్దరూ పెళ్లి చేసుకొన్నారు. వీరి పెళ్లికి చట్టబద్ధమైన గుర్తింపు లభించినట్టుగా కూడా తెలుస్తోంది!

మరింత సమాచారం తెలుసుకోండి: