రుణమాఫీ అమలు విషయంలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు మాట తప్పారని ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి అన్నారు.సోమవారం శాసనసభలో ఆయన ఈ అంశంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రైతు, డ్వాక్రా సంఘాల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీని ఆయన గుర్తుచేశారు. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌, గరిష్ట పరిమితి పేరుతో రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. గ్రామాల వారిగా మాఫీ పొందని వారి వివరాలను కేస్‌ స్టడీస్‌ అంటూ సభలో వివరించే ప్రయత్నం చేశారు. ఒక్కో రైతుకు వంద, రెండు వందల రూపాయలు మాత్రమే మాఫీ దక్కిందని చెప్పారు, ఈ సమయంలో జగన్‌ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసరావులు మాట్లాడేందుకు ప్రయత్నిం చడంతో అధికార, విపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. వైసీపి ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, రోజాలు మంత్రి అచ్చెన్నా యుడ్ని దూషించారని అధికారపక్ష సభ్యులు ఆరోపించారు. ఈ సందర్భంగా 'భూమా నాగిరిడ్డి... రౌడీ. ఆయనపై రౌడీషీటు ఉంది' అని కాల్వ శ్రీనివాసులు అన్నారు. దీంతో ఏర్పడిన గందరగోళంస్పీకర్‌ జోక్యంతో సభ సద్దుమణిగింది. అనంతరం జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రంలో సుమారు రూ.87,617 కోట్ల రూపా యల రైతుల రుణాలు, రూ.14,204 వేల కోట్లు డ్వాక్రా రుణాలు ఉన్నట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమా వేశంలో ముఖ్యమంత్రికి బ్యాంక్‌ ఉన్నతాధికారులు స్పష్టం చేసిన విష యం వాస్తవం కాదా అని జగన్‌ ప్రశ్నిం చారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రైతులకు, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తే, తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు 4 శాతం వడ్డీ చొప్పున రుణాలు అందిస్తోందన్నారు.  ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం గానే రైతు రుణాల వడ్లీకి వడ్డీ వేస్తూ బ్యాంకు లు 14 శాతంగా వసుళ్లు చేస్తున్నారని జగన్మో హన్‌రెడ్డి దుయ్యబట్టారు. రుణమాఫీకి ఆధార్‌ కార్డులు, రేషన్‌ కార్డులతో అనుసం ధానం చేయడంతో చాలాచోట్ల అయోమయ పరిస్థితులు నెలకొని ఉన్నాయన్నారు. 184, 185, 186వ ఎస్‌ఎల్‌బిసి సమావేశాలలో రైతులు తమ రుణాలను రీషెడ్యూల్‌ చెయ్యాల ంటే పాత రుణాలు తప్పక చెల్లించాల్సిందేనని స్పష్టం చేసిన అంశాన్ని ఈసందర్భంగా జగన్‌ సభలో ప్రస్తావించారు. ఇప్పటికైనా రైతులకు, డ్వాక్రా మహిళలకు ఎప్పటిలోగా రుణాలు మాఫీ చేస్తారు? వారికి రుణ పరిమితిని ఏమేరకు కేటాయించారో వివరాలను సభలో ఉంచాలని జగన్‌ అన్నారు. దీంతో అధికార పార్టీ సభ్యులు తీవ్ర స్థాయిలో జగన్‌పై విమర్శలు చేయడంతో సభలో తిరిగి గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేలు అధికారపార్టీ ఎమ్మెల్యేల వైపుకు దూసుకు వెళ్లడంతో ఇరువర్గాల మద్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: