భారత మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి డిమాండ్ చేశారు. దేశానికి ప్రధానిగా చేసిన పీవీని దేశ అత్యున్నత పురస్కారంతో గౌరవించాలని ఆయన అన్నారు. ఢిల్లీలో పీవీ 10వ వర్ధంతి కార్యక్రమానికి హాజరయిన ఆయన పీవీ ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక సంస్కరణలు దేశానికి ఎంతో మేలు చేశాయని, ఆయన ఈ అవార్డుకు అన్ని విధాలా అర్హుడని అన్నారు. వాజ్ పేయికి భారతరత్న ఇవ్వాలని అంటున్న నేపథ్యంలో బీజేపీ నేత ఈ డిమాండ్ చేయడం విశేషం. ఇది ఇలా ఉంటే ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన పీవీ 10వ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు డిప్యూటీ సీఎం రాజయ్య, హోంమత్రి నాయినీ నర్సింహరెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు నివాళులర్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: